పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ జన్ సూరజ్ పార్టీ దారుణంగా ఓడిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో జన్‌సూరజ్ పార్టీ మొత్తం 238 సీట్లలో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేదు. ఆ ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలని కోరుతూ ప్రశాంత్ కిషోర్ (Prasandth Kishor) దాఖలు చేసిన పిటీషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వం తన సంక్షేమ పథకంతో ఓటర్లకు డబ్బులు పంచిందని జన్‌సూరజ్ పార్టీ ఆరోపించింది.
Read Also: Thalapathy Vijay: TVK చీఫ్ విజయ్ కు కోర్టులో ఎదురుదెబ్బ
పిల్‌ను కొట్టిపారేసిన ధర్మాసనం
చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం ఆ పిల్‌ను కొట్టిపారేసింది. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారని, ఇప్పుడు మీరు పబ్లిసిటీ కోసం న్యాయ ప్రక్రియను వాడుకుంటారని చీఫ్ జస్టిస్ అన్నారు. మీకెన్ని ఓట్లు వచ్చాయి, ఒకసారి ప్రజలు తిరస్కరిస్తే, రిలీఫ్ కోసం జుడిషియల్ ఫోరంను వాడుతున్నారని, ఆ స్కీమ్‌ను ఎవరో ఒకరు ముందుగా ఛాలెంజ్ చేసి ఉండాల్సిందని కోర్టు పేర్కొన్నది. అయితే ఆ పిల్‌ను బీహార్ హైకోర్టుకు పంపింది సుప్రీం. కుటంబంలోని మహిళకు పదివేలు ఇవ్వడాన్ని పార్టీ తప్పుపట్టింది. ఆర్టికల్ 32 కింద తన పిటీషన్ ఫైల్ చేసింది. సుమారు 36 లక్షల మంది మహిళలకు డబ్బులు రిలీజ్ చేసి అధికార పార్టీ అక్రమ విధానాలకు పాల్పడినట్లు జన్‌సూరజ్ తన పిటీషన్‌లో తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: