Superstitions: ఆ ధునిక సాంకేతిక యుగంలో సమాంతరంగా మా నవ జీవన విధానాల్లో ఆధ్యాత్మిక చింతనతో పాటు అనాదిగా వస్తున్న అనేక విశ్వాసాల గురించి వాస్త వికతను తెలుసుకునేందుకు అధిక అవకాశం నేటిసమాజం లో గోచరిస్తూ ఉంటుంది. తరచుగా విభిన్న ఆచార వ్యవ హారాలకు సంబంధించిన దేవాలయాలకు వెళ్లి కొందరు సంకల్ప పూజలు చేసినట్టుగా వార్తలు రావడం కూడా వింటుంటాం. అది నిజమేనా కాదా అనే అంశాలను పక్కన పెడితే ఈకాలంలో కూడా అనాదిగా వస్తున్న నమ్మకాలతో జనాలు దైనందిన జీవితంలో ఇలాంటి అంశాలపై ఆసక్తిని పెంచుకోవడం సహజమే. అయినా సమాజంలో ఎవరినమ్మ కాలు విశ్వాసాలు వారివి. అయితే ఇటీవల తెలంగాణరాష్ట్రం లో ఏకంగా క్షుద్రపూజల అంశమే చర్చ కొనసాగుతుంది. అది కూడా మామూలు జనాల మధ్య జరిగిన అంశాలు కాకుండా క్షుద్ర పూజలు మంత్ర తంత్రాలు విషయమైప్రజా స్త్రీ నాయకులు చర్చించుకుంటున్న విధానం విస్తృతంగా సమా జంలో వినిపిస్తుంది. మానవ జీవన సరళిలో మూఢవిశ్వా సాలుగా చెప్పబడుతున్న చేతబడులు అంటే క్షుద్రపూజలు, మంత్ర తంత్రాలు లాంటిఅనేక రకాలైనటువంటి విశ్వాసా లు ఇప్పటికీ ఇంకా ఆధునిక నాగరిక జీవన విధానాలతో కలిసిపోయి ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో. ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ప్రజలకు సహజంగా ఈ అంశాలపై ఆసక్తి బాగాఉంటుంది.
Superstitions: సరైన దృక్పథం ఉండాలే కానీ..
సాధార ణంగా గ్రామీణ ప్రాంతాల్లో క్షుద్రపూజలు మంత్రతంత్రాలు అంటే చేతబడి లాంటి అంశాలపై విపరీతమైన విశ్వాసాలు గోచరిస్తూ ఉంటాయి. ఇలాంటి విషయాల్లో అనేక గ్రామాల్లో కొందరు క్షుద్రపూజలు చేస్తున్నారనే అనుమానాలతో అలాంటి వ్యక్తులపై హింసాత్మకదాడులు తరచుగా జరుగు తూనే ఉన్నాయి. వాస్తవంగా క్షుద్రపూజలు చేతబడులునేటి ఆధునిక జీవనవిధానాల్లో నమ్మదగినవి కాకపోయినా మానవ జీవన పురోగతిలో ఇలాంటి అంశాలు మానవుని బలహీనమైన మనసులకు మరింత ఆందోళన కలిగిస్తుంటా యి. అయితే సమస్యలు వచ్చినప్పుడు దానికి పరిష్కారం దొరకనప్పుడు ఏదో అతీత శక్తి ఉందని దానికి కారణమైన క్షుద్రశక్తులు ఉంటాయని నమ్మేవారు కూడా ఇప్పటికిఉన్నా రంటే ఆశ్చర్యం కలుగుతుంది. అందుకు ఎవరో ఒకరు ఇలాంటి క్షుద్ర పూజలతో చేతబడి చేస్తున్నారని ఇతరుల నష్టాన్ని కోరుకుంటారని అందుకే క్షుద్ర పూజలు చేయడం వలన ఏదో జరిగిపోతుంది అనేదిసామాన్య జనాల్లో ఉన్న ప్పటికీ, కొందరు నాయకుల్లోకూడా ఇలాంటి చర్చకొనసాగు తూ వస్తుండడం గమనార్హం. ఏదిఏమైనప్పటికీ బలహీన మైన మనసు కలిగినవారికి క్షుద్రపూజలు మంత్రతంత్రాలు లాంటి అంశాలు ఎంతో కొంత ఆసక్తిని కలిగిస్తుంటాయి. నమ్మకమైన జీవితం ధృఢవిశ్వాసం కలిగినటువంటిమనసు కలిగిన మానవులకు ఇలాంటివాటిపై ఆసక్తి తక్కువే. సమా జంలో కొంతమందిలో ఉండే లేనిపోని అపోహల వలన ఇలాంటి విభిన్నమైన అంశాలు తెరపైకివస్తుంటాయి. నిజా నికి ఆధునికంగా పరిణితి చెందుతున్న సమాజంలో మానవ జీవనప్రస్థానంలో విభిన్నవైవిధ్యాలు కలిగిన మానవుల మధ్య జరుగుతున్న అనేక విషయాలపై వాస్తవిక దృష్టితో నిర్దిష్టమైన ఆధారాలతో సరైన దృక్పథం ఉండాలే కానీ మూఢ విశ్వాసాలపై చర్చ అవసరం లేదనిపిస్తుంది.
-దాడిశెట్టి శ్యామ్ కుమార్