Sunetra Pawar : మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలవుతోంది. సునేత్రా పవార్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ బాధ్యతను స్వీకరించేందుకు ఆమె అధికారికంగా అంగీకారం తెలిపారు. డిప్యూటీ సీఎంతో పాటు ఎక్సైజ్, క్రీడల శాఖలను కూడా ఆమెకు అప్పగించనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 7న జరగనున్న పుణే జిల్లా పరిషత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్సీపీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీ నేతల ప్రతిపాదనపై పవార్ కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరిగిన అనంతరం సునేత్రా పవార్ ఈ బాధ్యతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆమె మహారాష్ట్ర చరిత్రలో తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించబోతున్నారు. మార్చిలో జరగనున్న బడ్జెట్ సమావేశాల కారణంగా ఆర్థిక శాఖను ప్రస్తుతం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వద్దే ఉంచనున్నారు. బడ్జెట్ అనంతరం ఆ శాఖను ఎన్సీపీకి అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. శనివారం సాయంత్రం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం, మంత్రులు, ప్రముఖ నేతలు హాజరుకానున్నారు.
Read Also: Kuppam : టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు
ఇదిలా ఉండగా, బుధవారం (Sunetra Pawar) ఉదయం పుణే జిల్లాలోని బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం కూలిపోవడంతో ఆయన సహా ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి, ఒక విమాన సహాయకురాలు, ఇద్దరు పైలట్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. గురువారం బారామతిలో ప్రభుత్వ లాంఛనాలతో అజిత్ పవార్ అంత్యక్రియలు నిర్వహించారు.
సునేత్రా పవార్ 1963 అక్టోబర్ 18న ధారాశివ్ జిల్లాలో జన్మించారు. 1985లో అజిత్ పవార్‌తో వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు కుమారులు పార్థ్ పవార్, జయ్ పవార్. ప్రస్తుతం ఆమె ఎన్సీపీ తరపున రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బారామతి నుంచి పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ, పార్టీ నేతగా బలమైన గుర్తింపును సంపాదించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: