Sukhoi-30 MKI: భారత వైమానిక దళంలో పెను విషాదం చోటుచేసుకుంది. అస్సాంలోని కార్బీ ఆంగ్‌లోంగ్ జిల్లాలో సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ జెట్ ప్రమాదానికి గురై కుప్పకూలింది. కార్బీ ఆంగ్‌లోంగ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ యుద్ధ విమానానికి రాడార్ నుంచి సంబంధాలు తెగిపోయినట్లు కేంద్ర రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. సుఖోయ్ ఆచూకీని గుర్తించేందుకు ఓ వైమానిక దళ బృందాన్ని రంగంలోకి దింపింది. వైమానిక దళ బృందం ఫైటర్ జెట్‌ను గుర్తించింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. మృతులు స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దుర్గాకర్‌గా గుర్తించారు.
Read Also: New Governor of Telangana : తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..ఈయన బ్యాక్ గ్రౌండ్ ఇదే !!
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి
కాగా, 1980లలో రష్యా అభివృద్ధి చేసిన సుఖోయ్ 30 ఎంకేఐ విమానాలు భారత వైమానిక దళానికి వెన్నెముకగా ఉన్నాయి. SU-30 MKI స్క్వాడ్రన్లను ఈశాన్య ప్రాంతంలో భారత వాయుసేన మోహరించింది. ఎస్‌యూ 30sల తొలి డెలివరీ 1997లో రష్యా అందజేసింది. ప్రస్తుతం వీటిని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తోంది. భారత వైమానిక దళం వద్ద 250కిపైగా ఫైటర్ జెట్లు ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: