📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest news: Suicide: బాబోయ్..ఆత్మహత్యల పై ChatGPT లో చర్చించుకుంటున్న జనం

Author Icon By Saritha
Updated: October 28, 2025 • 4:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మన సౌకర్యం కోసం..మన ఆనందం కోసం.. మరింత సౌలభ్యంగా, వేగంగా పనులు చేసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకుంటున్న మనం చివరికి మన వినాశనానికే అధికంగా ఉపయోగించడం విచారకరం. ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ ఓపెన్ ఏఐ సంచలన విషయాలు వెల్లడించింది. తమ చాట్ బాట్ చాట్ జీపీటీతో ప్రతివారం పదిలక్షల మందికి పైగా యూజర్లు ఆత్మహత్య (Suicide) ఆలోచనల గురించి చర్చిస్తున్నారని, ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశమని తెలిపింది. ఏఐపై ప్రజలు మానసికంగా, భావోద్వేగపరంగా ఎంతలా ఆధారపడుతున్నారో ఈ డేటా స్పష్టం చేస్తోంది. ప్రతి వారం చాట్ జీపీటీని వాడే యాక్టివ్ యూజర్లఓ 0.15శాతం మంది ఆత్మహత్యకు సంబంధించిన సంభాషణలు జరుపుతున్నారు. ప్రస్తుతం చాట్ జీపీటీకి వారానికి 800 మిలియన్లమంది యాక్టివ్ యూజర్లు ఉండగా, ఈ లెక్క పదిలక్షలకు పైగానే ఉంటుంది. దాదాపు ఇదే సంఖ్యలో యూజర్లు చాట్ జీపీటీపై తీవ్రమైన భావోద్వేగ అనుబంధం పెంచుకుంటున్నారని, లక్షలాది మందిలో మానసిక రుగ్మతల లక్షణాలు కనిపిస్తున్నాయని కూడా కంపెనీ పేర్కొంది.

ఈ సంభాషణలు గణాంకపరంగా చాలా అరుదైనప్పటికీ, తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారిసంఖ్య గణనీయంగా ఉందని ఇది సూచించడం విషాదం. 170 మంది మానసిక నిపుణులతో కలిసి పని ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, తమ ప్లాట్ఫామ్ ను సురక్షితంగా మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించే క్రమంలో ఓపెన్ ఏఐ ఈ వివరాలను పంచుకుంది. మానసిక ఆరోగ్య సంక్షోభం, ఆత్మహత్య ఆలలోచనల వంటి సున్నితమైన అంశాల్లో చాట్ బాట్ స్పందించే తీరును మెరుగుపరిచేందుకు 170మందికి పైగా మానసిక ఆరోగ్య నిపుణులతో కలిసి పనిచేసినట్లు తెలిపింది.

Read also: బాలికల బాత్ రూమ్ లో కెమెరాలు పెట్టిన అటెండర్స్ పై పోక్సో కేసు

Suicide: బాబోయ్..ఆత్మహత్యల పై ChatGPT లో చర్చించుకుంటున్న జనం

కొత్తగా అప్ డేట్ చేసిన జీపీటి-5 మోడల్

సున్నితమైన విషయాల్లో చాలా మెరుగ్గా పనిచేస్తున్నట్లు ఓపెన్(Suicide) ఏఐ వెల్లడించింది. అంతర్గత పరీక్షల్లో, పాత మోడల్తో పోలిస్తే కొత్తమోడల్ 65 శాతం అధికంగా సరైన రీతిలో స్పందించిందని కంపెనీ పేర్కొంది. ముఖ్యంగా ఆత్మహత్యకు సంబంధించిన సంభాషణల్లో భద్రతా నియమాలను పాటించడంలో పాత వమోడల్ 77శాతం సక్సెస్ అయితే, కొత్త మోడల్ 91శాతం కచ్చితత్వంతో పనిచేసిందని వివరించింది. కంపెనీపై తల్లిదండ్రుల దావా ఈ మెరుగుదలలు ఉన్నప్పటికీ ఓపెన్ ఏఐ తీవ్ర విమర్శలు, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది. చాట్ జీపీటీతో చర్చించిన తర్వాత 16 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కంపెనీపై దావా వేశారు. In Col 474 100% Windows (CRLF) UTF-8

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

AI Safety AI Updates ChatGPT GPT-5 india Latest News in Telugu mental health OpenAI Suicide Prevention Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.