రాజ్యసభ ఎంపీ, ప్రముఖ రచయిత్రి, తన పేరు, గొంతును ఉపయోగించి పెట్టుబడి పథకాలను ప్రచారం చేస్తున్న డీప్‌ఫేక్ వీడియోల (Deepfake videos) పట్ల ఎంపీ సుధామూర్తి ప్రజలను అప్రమత్తం చేశారు. ఆర్థిక పథకాల్లో పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉన్న ఈ వీడియోలు పూర్తిగా డీప్‌ఫేక్ టెక్నాలజీతో సృష్టించినవని, వాటిని నమ్మి మోసపోవద్దని ఆమె స్పష్టం చేశారు.
Read Also: Jharkhand: ఏనుగు బీభత్సంతో 22 మంది దుర్మరణం
మోసపూరిత కంటెంట్‌ను రిపోర్ట్ చేయాలి
ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో సృష్టించిన ఈ నకిలీ వీడియోల (Deepfake videos) ను నమ్మి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దని ఆమె కోరారు. తాను ఎప్పుడూ పెట్టుబడి పథకాల గురించి మాట్లాడనని, సందేహాలుంటే అధికారిక మార్గాల ద్వారా ధృవీకరించుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలు తమ కష్టార్జితాన్ని మోసగాళ్ల చేతిలో పెట్టి నష్టపోవద్దని, ఇటువంటి మోసపూరిత కంటెంట్‌ను రిపోర్ట్ చేయాలని ఆమె సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: