📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్

Sudha Murthy deepfake video : నా పేరుతో వీడియోలా? నమ్మొద్దు! సుధామూర్తి హెచ్చరిక

Author Icon By Sai Kiran
Updated: January 21, 2026 • 7:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Sudha Murthy deepfake video : ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు Sudha Murthy తన పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ వీడియోలపై ప్రజలను అప్రమత్తం చేశారు. పెట్టుబడి పథకాల్లో డబ్బులు పెట్టాలని ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తున్న ఈ వీడియోలు పూర్తిగా డీప్‌ఫేక్ టెక్నాలజీతో తయారు చేసినవేనని, వాటిని నమ్మవద్దని ఆమె స్పష్టం చేశారు.

ఈ మేరకు సుధామూర్తి ఒక ప్రకటన విడుదల చేశారు. తన ఫొటో, వాయిస్‌ను అనుమతి లేకుండా ఉపయోగించి ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారని, వాటిని ఆధారంగా చేసుకుని ఎవరూ ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తాను ఎప్పుడూ ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లను ప్రచారం చేయలేదని, భవిష్యత్తులో కూడా అలా చేయనని స్పష్టంగా తెలిపారు.

Read Also: AP: 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

ఇటీవల ఇలాంటి డీప్‌ఫేక్ వీడియోలను నమ్మి బెంగళూరుకు (Sudha Murthy deepfake video) చెందిన ఓ చార్టర్డ్ అకౌంటెంట్ రూ.23.20 లక్షలు నష్టపోయిన ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఈ ఘటనపై జనవరి 13న బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే సుధామూర్తి మరోసారి ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.

ఎవరైనా అనుమానాస్పద వీడియోలు లేదా సందేశాలు కనిపిస్తే వాటిని వెంటనే సంబంధిత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు రిపోర్ట్ చేయాలని, ఏ సమాచారం అయినా అధికారిక వనరుల ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలని ఆమె సూచించారు. సైబర్ మోసాల బారిన పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bengaluru cyber crime case Breaking News in Telugu cyber crime deepfake India deepfake scam warning deepfake technology misuse fake investment videos India Google News in Telugu Latest News in Telugu online fraud awareness Social Media Fake Videos Sudha Murthy deepfake video Sudha Murthy investment scam Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.