Street Animals: దేశవ్యాప్తంగా వీధికుక్కలు, రహదారులపై తిరిగే పశువుల నియంత్రణపై సుప్రీంకోర్టు (supreme court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఆసుపత్రులు వంటి ప్రజా ప్రాంగణాల్లో కుక్కకాటు ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆయా ప్రాంతాలను వీధికుక్కల రహితంగా మార్చాలని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియా లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు సమన్వయంతో జాయింట్ డ్రైవ్ నిర్వహించి, వీధికుక్కలను పట్టుకోవాలని సూచించింది.
Read also: Surat: యువకుడి పై కత్తితో దాడి..ఆపై కాళ్లు నాకించిన వైనం
Street Animals: రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో కుక్కలు లేకుండా చుడండి: సుప్రీంకోర్టు
షెల్టర్ హోమ్స్‌కు తరలించాలని
Street Animals: అదే విధంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై విచ్చలవిడిగా తిరుగుతున్న పశువుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే చర్యలు తీసుకుని రోడ్లపై ఉన్న పశువులను పట్టుకుని షెల్టర్ హోమ్స్‌కు తరలించాలని ఆదేశించింది. అలాగే వాటికి తగిన సంరక్షణ, వసతులు కల్పించాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) తప్పనిసరిగా అమలు చేయాలని ధర్మాసనం స్పష్టంగా తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: