📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Latest News: Statue Inauguration: ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక వాజ్పేయి

Author Icon By Saritha
Updated: December 15, 2025 • 10:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశాన్ని సరైన దిశలో నడిపిన పిఎం: ఉత్తరాఖండ్ సిఎం పుష్కరసింగ్ ధామి

మదనపల్లె : దేశ రాజకీయాల్లో(Statue Inauguration) అటల్ బిహారీ వాజ్పేయి(Atal Bihari Vajpayee) దూరదృష్టిగల పాలకునిగా, ప్రజాస్వామ్య విలువల ప్రతీకగా నిలిచారని ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్సింగ్ధామి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆదివారం నిర్వహించిన భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా హాజరై విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం టిప్పుసుల్తాన్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ అటల్జీ జీవితం దేశభక్తి, మానవీయ విలువలకు ప్రతిరూపమన్నారు. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి కాని దేశం నిలబడాలి అనే అటల్జీ మాట భారతదేశానికి మార్గదరుకం అన్నారు ప్రధాన మంత్రిగా నాటి పెయి దేశాన్ని శక్తివంతమైన దిశలో నడిపారన్నారు. అణుపరీక్షలు, రహదారి, ప్రాజెక్టులు, గ్రామీణ రహదారులు, టెలికాం విప్లవం వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో దేశ అభివృద్ధికి పునాదులు వేశారన్నారు. అటలీ ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. స్టార్టప్ ఇండియా, మేక్ ఇండియా, ఓకర్ఫర్ లోకల్, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా భారతదేశం స్వావలంభన దిశగా ముందుకు వెలుతుందన్నారు.

Read also: రాష్ట్రంలో పెరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులు

భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుదల

ప్రపంచంలో భారతదేశం(Statue Inauguration) నాల్గవ ఆర్థికశక్తిగా రూపొందుతుందన్నారు. కోవిడ్ సమయంలో స్వదేశీ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రపంచస్తాయికి మౌలిక సదుపాయాలు, నిర్మాణం మోడీ దూరదృష్టికి నిదర్శనమన్నారు. అయోధ్యలో రామమందిర్ నిర్మాణం, కాశీకారిడార్, ఉజ్జేనిలో మహాకాల్లోక్ వంటి అధ్యాత్మిక అభివృద్ధి కార్యక్రమాలు దేశ సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్నాయన్నారు. ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాకా రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి నిర్ణయాలతో ఒక భారత్ శ్రేష్ట భారత్ భావనను బలోపేతం చేశాయన్నారు. రాష్ట్రంలో సిఎం చంద్రబాబునాయుడు, డి.సిఎం పవన్కల్యాణ్ నాయకత్వంలో ఎన్డీఎ ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు. అనంతరం వైద్యఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ అటల్బీహారి వాజ్పేయి అభివృద్ది సంక్షేమం, జాతీయభద్రతకు పునాదులు వేసిన మహానేత అని కొనియాడారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు తిరిగి ప్రజాసమస్యలు తెలుసుకొని దేశాభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు.

అటల్ ఆశయాలతో మోదీ నాయకత్వంలో అభివృద్ధి

రాష్ట్ర అధ్యక్షులు టివిఎన్ మాదవ్ మాట్లాడుతూ మాజీ ప్రధాని అటల్బహారి వాజ్పాయి ప్రజాజీవితం, దేశభక్తి, ఆదర్శ రాజకీయ విలువలను స్మరించుకొన్నారు. దేశాభివృద్ధికి ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, మండలి ఉపసభాపతి జకియాఖాన్, 20సూత్రాల కమిటీ ఛైర్మెన్ లంక దినకర్లు మాట్లాడుతూ వాజ్పాయ్ను ఆదర్శంగా తీసుకొని ప్రధానమంత్రి నరేంద్రమోడీ 11సంవత్సరాలుగా దేశాన్ని సంక్షేమం, అభివృద్ధి రెండింటిని సమన్వయం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారన్నారు. బిజెపి జిల్లా అద్యక్షులు సాయిలోకేష్, రైల్వేకోడూరు, ఎమ్మెల్యే అరవ శ్రీధర్, బిజెపి జాతీయ నాయకులు చల్లపల్లె నరసింహారెడ్డి, రాయలసీమ జనసేనపార్టీ కోకన్వీనర్ రాందాలౌదరి, రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షులు శ్రీరామ్చినబాబు, విజయభారతి డాక్టర్ సేతు, బిజెపి జిల్లా ప్రదాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్, బర్నేపల్లి సంద్యారాణి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Atal Bihari Vajpayee Bharat Ratna BJP Democracy Indian Politics Latest News in Telugu madanapalle Narendra Modi Pushkar Singh Dhami Statue Inauguration Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.