State NameChange: దేవుడి స్వంత భూమి’గా పేరుగాంచిన కేరళ రాష్ట్రానికి త్వరలో కొత్త అధికారిక పేరు రానుంది. కేంద్ర క్యాబినెట్ తాజాగా రాష్ట్ర పేరు మార్పు ప్రతిపాదనలకు ఆమోదం తెలుపడంతో ఇకపై కేరళను ‘కేరళం’గా పిలిచే దిశగా ప్రక్రియ ముందుకు సాగనుంది. ఈ మార్పు రాష్ట్ర భాషా స్వరూపాన్ని ప్రతిబింబించడమే కాకుండా, స్థానిక సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం తెలిపే కీలక అడుగుగా భావిస్తున్నారు.
Read Also:Mamata Banerjee: కేరళకు ఓకే.. బెంగాల్‌కు ఎందుకు కాదు? మమత ఆగ్రహం
సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రాష్ట్రాల పేర్ల మార్పుల పరంపర
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అనేక రాష్ట్రాలు, నగరాల పేర్లు స్థానిక భాషా, చారిత్రక నేపథ్యాన్ని ప్రతిబింబించేలా మారాయి. తూర్పు పంజాబ్ పేరు పంజాబ్‌గా, యునైటెడ్ ప్రావిన్సెస్ ఉత్తరప్రదేశ్‌గా, మద్రాస్ రాష్ట్రం తమిళనాడుగా, ఒరిస్సా ఒడిశాగా మారిన ఉదాహరణలు ఉన్నాయి. అలాగే బాంబేను ముంబయిగా, మద్రాస్‌ను చెన్నైగా పునర్నామకరణం చేశారు.
కేరళకు ‘కేరళం’ అనే పేరు ఇవ్వడం కూడా ఇదే క్రమంలో చేపట్టిన చర్యగా భావిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజల భాషా గర్వాన్ని మరింత పెంచడమే కాకుండా, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం కల్పించనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: