📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest News: Karur stampede: తొక్కిసలాట.. విజయ్‌ని అరెస్ట్ చేస్తారా?.. సీఎం స్టాలిన్ ఏమన్నారంటే..!

Author Icon By Anusha
Updated: September 28, 2025 • 10:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడులో కరూర్ పట్టణం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే, నటుడు-రాజకీయ నాయకుడు, టీవీకే ((TVK) Party)  అధినేత విజయ్  (Vijay)నిర్వహించిన బహిరంగ సభ ఓ ఘోర విషాదానికి వేదికైంది. శనివారం సాయంత్రం జరిగిన ఈ సభలో జరిగిన తొక్కిసలాటలో మొత్తం 38 మంది ప్రాణాలు కోల్పోవడం, మరో 46 మందికి పైగా తీవ్రంగా గాయపడటం రాష్ట్రాన్ని వేదనలో ముంచేసింది.

మరణించిన వారిలో 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉండటం ఈ ఘటనను మరింత హృదయవిదారకంగా మారుస్తోంది.వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Karur Stampede: తమిళనాడు ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్రం

Karur stampede

ఈ సభకు కార్యకర్తలు, అభిమానులు ఊహించని రీతిలో భారీ సంఖ్యలో

శనివారం జరిగిన ఈ సభకు కార్యకర్తలు, అభిమానులు ఊహించని రీతిలో భారీ సంఖ్యలో తరలివచ్చారు. విజయ్ వేదికపై (on stage) ప్రసంగిస్తున్న సమయంలో జనాన్ని నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది. విపరీతమైన జనం, తీవ్రమైన ఉక్కపోత కారణంగా చాలామంది ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయారు.

పరిస్థితిని గమనించిన విజయ్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపివేశారు. కొందరికి స్వయంగా మంచినీటి బాటిళ్లు అందించే ప్రయత్నం చేశారు.అయినప్పటికీ, కొద్దిసేపట్లోనే పరిస్థితి పూర్తిగా చేయిదాటి పెను తొక్కిసలాటకు దారితీసింది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు, అంబులెన్సులు (Ambulances) జనసందోహం మధ్య నుంచి అతికష్టం మీద క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాయి.

విజయ్‌ను అరెస్ట్ చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా,

ఈ ఘటనపై సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన హుటాహుటిన కరూర్ చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ… “ఇది రాజకీయ విమర్శలు చేసే సమయం కాదు.

బాధితులకు మెరుగైన వైద్యం అందించడమే మా ప్రథమ కర్తవ్యం. ఘటనపై విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు. విజయ్‌ను అరెస్ట్ చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా, దాని గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదని ఆయన స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

38 dead Breaking News karur public meeting latest news mass gathering mishap political rally tragedy stampede incident Tamil Nadu Politics Telugu News vijay fans Vijay TVK women and children victims

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.