తమకు ఇష్టదైవాన్ని దర్శించుకుంటే కష్టాలు పోతాయని భక్తులు భావిస్తారు. బాధలు ఇట్టే సమసిపోతాయని నమ్ముతారు. భవిషష్యత్తు అయినా ఉజ్వలంగా ఉండాలనే కోటి ఆశలు, కోరికలకు మొక్కుబడులు చేస్తారు. ఆ కోరికలు కాస్త తీరాయని అనిపించగానే తమ ఆరాధ్యదేవతలను దర్శించేందుకు పయనమవుతారు. ఎన్నో వ్యయప్రయాసలకు గురై దేవుడిని దర్శించుకునేందు (To visit God) కు వస్తారు. కానీ ఇంతలో ఏం పుకార్లో ఏమో తెలియదు, విపరీతమైన జనాలమధ్య ఏదో అలజడి. వెరసి కళ్లు మూసి తెరిచేలోగా అనేకుల పాణాలు గాల్లో హరించడం, ఆస్పత్రిలో చిక్సిత పొందడం జరుగుతున్నది.
ఇటీవల కాలంలో దైవదర్శనాలలో తొక్కిసలాట (Stampede)ల సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరం తిరుమలలో జరిగిన తొక్కిసలాటలో కొందరు మరణిస్తే, చాలామంది గాయపడ్డారు. గత సంవత్సరం కుంభమేళలో జరిగిన తొక్కిసలాటలో కూడా అనేకులు చనిపోయారు. ఆంధ్రప్రదేశ్లో పుష్కరాల ఘాటువద్ద జరిగిన తొక్కిసలాట(Stampede)లో కూడా పదుల సంఖ్యలో మరణించారు. ఇలా తరచూ దేవాలయాల్లో తొక్కిసలాట ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎంత రద్దీ ఉంటుందో ప్రభుత్వం ఖచ్చితంగా అంచనా వేయలేక, సరైన ముందుస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ హరిద్వార్లోని ప్రసిద్ధ మానసాదేవి ఆలయం (Manasa Devi Temple)లో ఆదివారం ఉందయం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. కరెంట్ షాక్ పుకారే ఈఘోర విషాదానికి కారణమని అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఉత్తరప్రదేశ్ బారాబంకిలోని అవసనేశ్వర్ మహాదేవ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మరణించారు. అయితే ఈ రెండు తొక్కిసలాటకు కారణం విద్యుత్ తీగలు తెగిపోయాయని పుకార్లు వ్యాపించడమే కారణం.
పెద్ద ఎత్తున వచ్చిన జనాలు
శ్రావణమాసంలో మూడవ సోమవారం శివుడికి జలాభిషేకం చేస్తే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. దీనికోసమే భక్తులు అవసనేశ్వర్ ఆలయానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ముఖ్యంగా శ్రావణమాసంలో శివభక్తులు పెద్దసంఖ్యలో సందర్శిస్తుంటారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో రాజ్‌నాథ్ సింగ్ చర్చ