స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన డిజిటల్ సేవలను మరింత విస్తరించే దిశగా కీలక అడుగు వేసింది. తాజాగా యోనో 2.0 (YONO 2.0) పేరుతో నూతన యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా కస్టమర్లకు మరింత సులభమైన, వేగవంతమైన బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యంగా ఎస్‌బీఐ ముందుకు సాగుతోంది.
Read Also: CM Chandrababu: కొత్త కానిస్టేబుళ్లతో నేడు సీఎం సమావేశం
ఇప్పటికే 3,500 మందిని తీసుకున్నాం
కస్టమర్లకు డిజిటల్ సేవలపై అవగాహన కల్పించేందుకు కొత్తగా 6,500 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు SBI ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి (Srinivasulu Shetty) తెలిపారు. ‘బ్యాంకింగ్‌ను సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా MAR 31 నాటికి ఫ్లోర్ మేనేజర్ల స్థాయిలో 10K మంది రిక్రూట్‌మెంట్‌కు ప్లాన్ చేశాం. ఇప్పటికే 3,500 మందిని తీసుకున్నాం’ అని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: