हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Srinivas Goud: ఆగస్టు 7న గోవాలో జాతీయ ఒబిసి మహాసభ

Anusha
Srinivas Goud: ఆగస్టు 7న గోవాలో జాతీయ ఒబిసి మహాసభ

మహాసభ పోస్టర్ను ఆవిష్కరించిన ఎంపిలు ఈటల, అసదుద్దీన్, వద్దిరాజు రవిచంద్ర

హైదరాబాద్ : దేశంలోని బిసిలంతా రాజకీయాలకతీతంగా ఐక్యం కావలసిన అవసరం ఉందని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆగస్టు 7న గోవాలో జరిగే జాతీయ ఓబీసీ మహాసభ (OBC Mahasabha) ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ ఓబిసి మహాసభల పోస్టర్ను ఆదివారం హైదరాబాద్లో ఆవిష్కరించినట్టు తెలిపారు. పోస్టర్ను ఎంపిలు ఈటల రాజేందర్, అసదుద్దీన్ ఓవైసీ, వద్దిరాజు రవిచంద్ర ఆవిష్కరించినట్టు జాజుల తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బిసి కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బిసి విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బిసి యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కురుమ, జాజుల లింగం గౌడ్, పాలకూరి కిరణ్, నాగరాజు గౌడ్, గణం నరసింహ, ఇంద్రం రజక, పవన్ సాయి గౌడ్, బండిగారి భరత్, పాల్గొన్నారు.

ప్రతినిధులతో కలిసి

ఆగస్టు 7న గోవాలో జరిగే 10వ జాతీయ ఓబిసి మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ బిజెపి లోక్సభసభ్యులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఒవైసీ, బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) బిసి సంక్షేమ సంఘం ప్రతినిధులతో కలిసి మహాసభల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారని తెలిపారు.మహాసభలకు హాజరుకావాలని ఈటలకు వారి ఇంటి వద్ద, అలాగే అసదుద్దీన్ ఓవైసీకి దారుసలెంలో, ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు వారి నివాసంలో మహాసభలకు అతిథులుగా హాజరుకావాలని ఆహ్వాన పత్రికలను అందజేసినట్టు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Srinivas Goud: ఆగస్టు 7న గోవాలో జాతీయ ఒబిసి మహాసభ
Srinivas Goud: ఆగస్టు 7న గోవాలో జాతీయ ఒబిసి మహాసభ

జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో

ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బిసిలకు మంచి రోజులు రానున్నాయని, బిసిల చైతన్యం కోసం నిరంతరం బిసి సంఘాలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ చైతన్యాన్ని ఇదే విధంగా ముందుకు కొనసాగించి బిసిలు తాము కోల్పోతున్న హక్కులను సాధించుకోవాలని, జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో తమ వాటాను సాధించుకోవడం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా అందర్నీ కలుపుకొని ముందుకు కొనసాగాలన్నారు.ఆగస్టు 7న గోవా రాష్ట్రంలోని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో జరిగే జాతీయ 10వ మహాసభలకు దేశం నలుమూలల నుండి హాజరై బిసిల ఐక్యతను చాటాలని, ఓబిసి మహాసభలకు తాము కూడా హాజరు అవుతామని ఎంపిలు వెల్లడించారని తెలిపారు.

ఆయన మంత్రిగా ఏ శాఖలు నిర్వహించారు?

శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో టూరిజం, సాంస్కృతిక, క్రీడలు యువజన వ్యవహారాలు శాఖల మంత్రిగా పని చేశారు.

ఆయన రాజకీయ ప్రయాణం ఎలా మొదలైంది?

శ్రీనివాస్ గౌడ్ మొదటగా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. తర్వాత ఉద్యోగం నుంచి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత BRS పార్టీలో చేరి రాజకీయంగా ఎదిగారు.

Read Hindi News : hindi.vaartha.com

Read also : Medaram: మేడారం జాతరకు రూ.5 కోట్లు విడుదల

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870