కర్ణాటక రాష్ట్రం మహిళా ఉద్యోగుల కోసం పెద్ద పద్దతిలో కొత్త పాలసీని ఆమోదించింది. 2025 అక్టోబర్ 9న కేబినెట్ “‘మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ, (menstrual) 2025″ ని ఆమోదించింది. ఈ పాలసీ ప్రకారం మహిళా ఉద్యోగులు ప్రతి నెల ఒక రోజు జీతం పొందే సెలవు తీసుకోవచ్చు. ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకే కాదు. రాష్ట్రంలోని ప్రైవేట్ కంపెనీలు, ఐటి ఫిర్మ్స్, MNCs, గార్మెంట్ యూనిట్స్ కూడా ఈ పాలసీ కింద వస్తాయి. మొదట సంవత్సరానికి ఆరు రోజుల సెలవు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ, తర్వాత లేబర్ డిపార్ట్‌మెంట్ దీన్ని ప్రతి నెల ఒక్క రోజుకి మార్చింది.
UP: సహజీవనంపై గవర్నర్ ఆనందిబెన్ సంచలన వ్యాఖ్యలు
18 మంది సభ్యులతో కమిటీ
కర్ణాటక ప్రభుత్వం ముందుగా 18 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మహిళల హక్కులను కాపాడడం, మెన్స్ట్రువల్ (menstrual) సమయంలో ఉపయోగించే ఉత్పత్తులను ఉచితంగా అందించడం వంటి అంశాలపై ఒక బిల్‌ను సిద్ధం చేసింది. ఇక ప్రైవేట్ సెక్టార్ లో కూడా కొన్ని కంపెనీలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు “స్విగ్గీ”, మహిళా డెలివరీ వర్కర్లకు “ప్రతి నెల రెండు రోజుల సెలవు”, మరియు జొమాటో, ఏడాదికి 10 రోజుల జీతపొందే సెలవును ఇస్తుంది.
బీహార్ 1992 నుండి ప్రతి నెల రెండు రోజుల సెలవులు
ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి విధానాలు అమలు చేస్తున్నారు. బీహార్ 1992 నుండి ప్రతి నెల రెండు రోజుల సెలవు అందిస్తుంది. 2023లో కేరళ రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో చదివే మహిళా విద్యార్థుల కోసం మెన్స్ట్రువల్ లీవ్ విధానాలు ప్రవేశపెట్టింది. 2024 ఆగస్టులో ఒడిశా మహిళలకు ప్రతి నెల ఒక్క రోజు సెలవు ఇచ్చే విధానం ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా కూడా జపాన్, స్పెయిన్, ఇండోనేషియా, సౌత్ కొరియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, తైవాన్ వంటి దేశాల్లో మహిళలకు మెన్స్ట్రువల్ సెలవులు కల్పిస్తున్నారు.
2024 జూలైలో, సుప్రీం కోర్ట్ ఈ అంశం పై గమనించింది. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మెన్స్ట్రువల్ సెలవులను తీసుకునే విధానాలను పరిగణించాలి అని సూచించింది. ప్రధాన న్యాయమూర్తి “డివై చంద్రచూడ్”, ఇది మహిళల వర్క్ ఫోర్స్ లో భాగస్వామ్యాన్ని పెంచే అవకాశం ఉన్నా కొంతమంది కంపెనీలు మహిళలను నియమించడంలో వెనకడుగు వేస్తున్నారు అని చెప్పడం గుర్తుంచుకున్నారు.
“నినాంగ్ ఎరింగ్” ‘మెన్స్ట్రువేషన్ బెనిఫిట్ బిల్’
2017లో, అరుణాచల్ప్రదేశ్ ఎంపీ “నినాంగ్ ఎరింగ్” ‘మెన్స్ట్రువేషన్ బెనిఫిట్ బిల్’ను ప్రవేశపెట్టారు. ఇందులో మహిళలకు ప్రతి నెల రెండు రోజుల జీతం పొందే సెలవు ఇవ్వాలని ప్రతిపాదన ఉంది కానీ అది ఇంకా ఆమోదం పొందలేదు. కర్ణాటక పాలసీ వెనుక ముఖ్య ఉద్దేశ్యం మహిళల ఆరోగ్యం, వర్క్‌ప్లేస్ సౌకర్యం. మెన్స్ట్రువల్ సమయంలో సెలవు తీసుకోవడం స్టిగ్మా లేకుండా, భయమ లేకుండా సౌకర్యవంతంగా ఉండే వాతావరణాన్ని సృష్టించడానికి దీని ఉద్దేశం. భారతదేశంలో దేశవ్యాప్తంగా మెన్స్ట్రువల్ లీవ్ చట్టం లేకపోయినా, బీహార్, ఒడిశా వంటి రాష్ట్రాలు, కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఇప్పటికే ఇలాంటి విధానాలు ప్రవేశపెట్టాయి.
స్త్రీలలో పీరియడ్స్ రావడానికి కారణం ఏమిటి?
ఒక అండం ఉత్పత్తి అవుతుంది, గర్భాశయం యొక్క లైనింగ్ చిక్కగా మారుతుంది, హార్మోన్లు యోని మరియు గర్భాశయ ద్వారంను వీర్యకణాలను స్వీకరించడానికి మరియు మద్దతు ఇవ్వడానికి సిద్ధం చేస్తాయి. గర్భం దాల్చనప్పుడు, అండం తిరిగి శరీరంలోకి శోషించబడుతుంది మరియు గర్భాశయంలోని మందపాటి లైనింగ్ తొలగించబడుతుంది, ఇది మీ పీరియడ్స్. అప్పుడు చక్రం మళ్ళీ ప్రారంభమవుతుంది.
పీరియడ్స్ ని ఎలా ఆపాలి?
గర్భనిరోధక మాత్రలు, ఇంజెక్షన్లు, ప్యాచ్‌లు, యోని రింగులు, ఇంప్లాంట్లు లేదా హార్మోన్ల ఇంట్రాటూరైన్ పరికరాలు (IUDలు) వంటి హార్మోన్ల జనన నియంత్రణ పద్ధతులను ఉపయోగించడం ద్వారా మీరు మీ పీరియడ్స్ ని ఆపవచ్చు లేదా ఆలస్యం చేయవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :