పీఎఫ్ (PF) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించనుంది. పీఎఫ్ సొమ్మును విత్‌డ్రా చేసుకోవడం కోసం మరింత సులభతరమైన మార్గాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలో నగదు డిపాజిట్ అయ్యేలా ఒక ప్రత్యేకమైన యాప్‌ను రూపొందిస్తోంది. ఏప్రిల్ 2026 నాటికి ఈ సరికొత్త సర్వీసును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న ఉమాంగ్ (UMANG) యాప్‌నకు అదనంగా, ఈ సరికొత్త యాప్ పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియను మరింత వేగవంతం చేయనుంది.
Kerala: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్
ప్రస్తుతం పీఎఫ్ సొమ్ము విత్‌డ్రా చేయాలంటే ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ప్రక్రియలో వారం నుండి పది రోజుల సమయం పడుతోంది. అయితే, రాబోయే కొత్త విధానంలో కేవలం 3 రోజుల్లోనే నగదు నేరుగా బ్యాంక్ అకౌంట్‌కు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే గరిష్ఠంగా రూ. 5 లక్షల వరకు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు యూపీఐ ద్వారా పీఎఫ్ ట్రాన్సాక్షన్స్ చేసే అవకాశం లేకపోవడంతో, ఈ కొత్త ఫీచర్ సామాన్య ఉద్యోగులకు పెను మార్పుగా మారనుంది.
కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త యాప్‌ను అత్యాధునిక సాంకేతికతతో రూపొందిస్తోంది. కేవలం క్లెయిమ్ చేయడమే కాకుండా, తన పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, నామినీ వివరాలను అప్‌డేట్ చేయడం వంటి సేవలు కూడా సులభతరం కానున్నాయి. యూపీఐతో అనుసంధానం చేయడం వల్ల తప్పులు జరిగే అవకాశం తగ్గడమే కాకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వేగంగా చెల్లింపులు జరుగుతాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా పీఎఫ్ రంగాన్ని కూడా పూర్తిస్థాయిలో ఆధునీకరించడంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com