📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

South Central Railway : సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

Author Icon By Sai Kiran
Updated: December 26, 2025 • 6:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

South Central Railway : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం కాకినాడ, నాందేడ్, మచిలీపట్నం మార్గాల్లో మొత్తం ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక సర్వీసులు జనవరి 11 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

రైల్వే ప్రకటన ప్రకారం, రెండు ప్రత్యేక రైళ్లు కాకినాడ – సికింద్రాబాద్ – వికారాబాద్ మార్గంలో నడుస్తాయి. మరో రెండు రైళ్లు నాందేడ్ – కాకినాడ మధ్య సేవలందిస్తాయి. అదనంగా, మచిలీపట్నం – వికారాబాద్ మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

Read also: Copper Price : భవిష్యత్లో సిరులు కురిపించనున్న కాపర్!

కాకినాడ – వికారాబాద్ ప్రత్యేక రైలు (07450) జనవరి 19న సాయంత్రం 4:45 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.
వికారాబాద్ – కాకినాడ రైలు (07451) జనవరి 20న ఉదయం 9 గంటలకు వికారాబాద్ నుంచి బయలుదేరి, రాత్రి 9:15 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది.

నాందేడ్ – కాకినాడ ప్రత్యేక రైలు (07452) జనవరి (South Central Railway) 12న మధ్యాహ్నం 1:30 గంటలకు నాందేడ్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కాకినాడ – నాందేడ్ రైలు (07453) జనవరి 13న మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది.

అలాగే, మచిలీపట్నం – వికారాబాద్ రైలు (07454) జనవరి 11 మరియు 18 తేదీల్లో ఉదయం 10 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 8 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.
వికారాబాద్ – మచిలీపట్నం రైలు (07455) జనవరి 11, 18 తేదీల్లో రాత్రి 10 గంటలకు వికారాబాద్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8:15 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లలో ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులను కోరింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

Breaking News in Telugu Google News in Telugu Indian Railways festival special Indian Railways Sankranti rush Kakinada special train Latest News in Telugu Machilipatnam special train Nanded special train railway special services January Sankranti special trains SCR special trains news South Central Railway Telugu News Vikarabad special train

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.