భారతీయ రైల్వే (Indian Railway) దేశవ్యాప్తంగా రవాణా రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అయితే, వీరిలో కొంతమంది టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ అక్రమ ప్రయాణాలను అరికట్టేందుకు రైల్వే అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Read Also: Former CJI Justice NV Ramana: నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు
ప్రత్యేకించి దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలోని అధికారులు ఇటీవల నెలలుగా తనిఖీలను మరింత కఠినతరం చేశారు. అక్టోబర్ నెలలో పండుగల సీజన్ సందర్భంగా భారీ రద్దీ ఉండటంతో, అధికారులు అదనపు బృందాలను నియమించి, రైళ్లలో టికెట్ చెకింగ్ (Ticket checking) ను బలోపేతం చేశారు. ఫలితంగా టికెట్ లేకుండా ప్రయాణించిన వారిపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు.
అధికారిక గణాంకాల ప్రకారం, SCR పరిధిలో ఒక్క అక్టోబర్ నెలలోనే 3.83 లక్షల టికెట్ లేని ప్రయాణికులను గుర్తించారు. వీరిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. ఈ తనిఖీల ద్వారా రూ.25.22 కోట్లు ఆదాయం రైల్వే ఖాతాలో జమైంది. ఇది SCR చరిత్రలోనే అత్యధిక నెలవారీ ఆదాయంగా నమోదైంది.
అత్యధిక సింగిల్-డే ఆదాయం
టికెట్లు లేకుండా ప్రయాణించడం, అక్రమ ప్రయాణాలు, బుక్ చేయని లగేజీలకు సంబంధించి మొత్తం 3.83 లక్షల కేసులను సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railway) అధికారులు నమోదు చేశారు. మొత్తం నెలవారీ ఆదాయంతో పాటు, ఈ జోన్ ఒక్క రోజులోనే అత్యధిక ఆదాయాన్ని కూడా నమోదు చేసింది.
ఇటీవల ముగిసిన పండుగల సీజన్‌లో భాగంగా.. అక్టోబర్ 13వ తేదీన ఒక్క రోజు టికెట్ తనిఖీ ద్వారా రూ.1.08 కోట్లు వసూలు చేసింది. ఇది దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక సింగిల్-డే ఆదాయం కావడం విశేషం.
ప్రయాణికులను గుర్తించి వారి నుంచి జరిమానాలు వసూలు
ఈ ఒక్క రోజు తనిఖీల్లోనే సుమారు 16,105 మంది టికెట్‌లేని లేదా అక్రమంగా ప్రయాణించే ప్రయాణికులను గుర్తించి వారి నుంచి జరిమానాలు వసూలు చేశారు.సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railway) జోన్‌లోని ఆరు డివిజన్ల పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ జోన్‌లోలలో తనిఖీలను పటిష్టం చేశారు.
ఈ ప్రత్యేక డ్రైవ్‌ల నిర్వహణకు ఆర్పీఎఫ్ సహకారం కూడా తీసుకున్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన స్టేషన్లు, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో తనిఖీలు నిర్వహించడం ద్వారా ఈ రికార్డు ఆదాయం సాధ్యమైంది.
సాధారణ రోజుల్లో జోన్ సగటు రోజువారీ ఆదాయం సుమారు రూ.47 లక్షలు కాగా.. అక్టోబర్‌లో ఇది గణనీయంగా పెరిగింది. టికెట్ తనిఖీలను నిరంతరం కొనసాగించడం ద్వారా అనర్హులైన ప్రయాణికులను అరికట్టి, రైల్వే ఆదాయాన్ని పరిరక్షించడంలో అధికారులు సఫలమయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: