📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Sonia Gandhi : నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం

Author Icon By Divya Vani M
Updated: April 12, 2025 • 7:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి హీటెక్కింది మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తును వేగవంతం చేసింది. తాజాగా ఈ కేసులో కీలక పాత్ర పోషిస్తున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL)కు చెందిన రూ.700 కోట్ల విలువైన ఆస్తులపై కన్నేసింది.నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే AJL సంస్థను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఈ యంగ్ ఇండియన్ సంస్థలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు తలా 38 శాతం చొప్పున వాటా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా, ఢిల్లీ, ముంబై, లక్నోలో ఉన్న AJL ఆస్తులను ఈడీ గుర్తించింది. వీటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద చర్యలు ప్రారంభించింది ఈ జాబితాలో ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్ కూడ ఉంది. గతంలో తాత్కాలికంగా ఈ ఆస్తిని ఈడీ అటాచ్ చేసినా, ఇప్పుడు శాశ్వతంగా స్వాధీనం చేసుకోబోతోంది.ఈడీ వెల్లడించిన వివరాల ప్రకారం – యంగ్ ఇండియన్ సంస్థ, AJL ఆస్తులను అక్రమంగా వాడి కోట్ల రూపాయలు సంపాదించింది.

Sonia Gandhi నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం

రూ.18 కోట్ల నకిలీ విరాళాలు, రూ.38 కోట్ల నకిలీ అద్దెలు, అలాగే రూ.29 కోట్ల ఫేక్ అడ్వర్టైజింగ్ ద్వారా డబ్బును తెలివిగా మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ లావాదేవీలు అంతా మనీ లాండరింగ్ కిందకి వస్తాయని ఈడీ స్పష్టంగా చెబుతోంది. విచారణ అనంతరం చాలా అంశాలు బహిర్గతమయ్యాయని, ఎలాంటి అనుమానం లేకుండా కేసును ముందుకు తీసుకెళ్లేందుకు వారు సిద్ధమయ్యారు. ఈడీ చేపట్టిన తాజా చర్యలతో కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్‌ను పూర్తిగా జప్తు చేయడంపై రాజకీయంగా కూడా స్పందనలు వస్తున్నాయి. అయితే ఈడీ మాత్రం అన్ని ఆధారాలతో ముందుకు సాగుతోంది. క్లుప్తంగా చెప్పాలంటే – నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారుతోంది. రూ.700 కోట్ల ఆస్తుల జప్తుతో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగినట్టే.

Read Also : Mumbai to Dubai :ముంబై టూ దుబాయ్ ట్రైన్..రెండు గంటలే ప్రయాణం

AJLAssetsSeized EDRaids MoneyLaunderingCase NationalHeraldCase PMLAAction RahulGandhi SoniaGandhi YoungIndian

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.