📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

Noida: నాన్నా చావాలని లేదు కాపాడు..తండ్రి కళ్లముందే కొడుకు జలసమాధి

Author Icon By Vanipushpa
Updated: January 21, 2026 • 5:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నాన్నా నన్ను కాపాడు. నా కారు ప్రమాదానికి గురయింది. కారుతో పాటు నేనూ నీటిలో మునిగిపోతున్నాను. నాకు బతకాలనుంది నాన్నా అంటూ 27 ఏల్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ తండ్రికి ఫోన్‌ చేసి వేడుకున్నాడు. తండ్రి అలర్ట్‌ అయి పోలీసులకు సమాచారం ఇచ్చి వెంటనే స్పాట్‌కు చేరుకున్నాడు. లోతైన నీటి గుంతలో కుమారుడు తన కళ్లముందే జలసమాధి అవుతుండటాన్నిచూసి ఆ తండ్రి తల్లడిల్లి పోయాడు. నాన్నా నాన్ను కాపాడు.. నాకు చావాలని లేదు అంటూ కోడుకు ఆక్రందన ఆ తండ్రి గుండెను పిండేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా(Noida)లో ఈ ఘోరం జరిగింది.
గురుగావ్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో డాటా అనలిస్టుగా పనిచేస్తున్న యువరాజ్‌ అనే టెకీ ఈ నెల 16న రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన పోగమంచులో దారి కనిపించక యువరాజ్‌ కారు రోడ్డు పక్కనున్న లోతైన గుంతలోకి దూసుకుపోయింది.

Read Also: Budget 2026: ఉద్రిక్తతల మధ్య బడ్జెట్‌ ఎలా ఉంటుంది?

ఆలస్యంగా వచ్చిన ఎన్డీఆర్‌ఎఫ్‌ రెస్క్యూ టీం

నీటిలో మునిగిపోతున్న కారులోనుంచే యువరాజ్‌ కేకలు వేశాడు. హెల్ప్‌ హెల్ప్‌ అని అరిచాడు. తండ్రికి, స్నేహితుడికి ఫోన్‌ చేసి కాపాడాలంటూ వేడుకున్నాడు. తండ్రి ఇచ్చిన సమాచారంతో పోలీసులు అరగంటలో స్పాట్‌కు చేరుకున్నా ఎన్డీఆర్‌ఎఫ్‌ రెస్క్యూ టీం రావడం ఆలస్యమైంది. రక్షణ సామాగ్రితో అక్కడకి చేరుకుని కారును నీటిలోనుంచి తీయడానికి ఐదు గంటలు పట్టింది. దీంతో యువరాజ్‌ అందరి చూస్తుండగానే నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. రాత్రి 12గంటల సమయంలో ఘటన జరగడం వల్ల సహాయక బృందాలు స్పాట్‌కు చేరుకోవడం ఆలస్యమవడంతో పాటు దట్టమైన పొగమంచు కారణంగా యువరాజ్‌ ప్రాణాలు కాపాడలేకపోయారు.

దట్టమైన పొగమంచులో స్పాట్‌ను వెంటనే గుర్తించలేకపోయారు

గంటా 45 నిమిషాలపాటు తనను కాపాడాలంటూ యువరాజ్‌ వేడుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సరైన రక్షణ పరికరాలతో సకాలంలో ఘటనాస్థలానికి అధికార యంత్రాంగం చేరుకుని ఉంటే తన బిడ్డ బతికేవాడని యువరాజ్‌ తండ్రి రాజ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. నీటి గుంత ఎక్కువ లోతు ఉండటంతో దట్టమైన పొగమంచులో స్పాట్‌ను వెంటనే గుర్తించలేకపోయామని రెస్క్యూ టీం చెబుతున్నారు. యూపీ సర్కార్‌ ఈ ఘటనను సీరియస్‌ తీసుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

accidental death news emotional human interest story father witnesses tragedy river drowning case son drowned in water Telugu News online Telugu News Today tragic drowning incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.