📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Somnath Temple : నవ సంకల్ప స్పూర్తి.. సోమనాథ్ దీప్తి

Author Icon By Sudha
Updated: January 6, 2026 • 5:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సోమనాథ్… ఈ పదం చెవినపడగానే మన హృద యాంతరాళం పులకాంకితమై, మదిలో సగర్వ భావన మెదలుతుంది. ఇది భారతీయాత్మ అనంత స్పందన. ఈ అద్భుత ఆలయం పశ్చిమ భారత తీరంలోని గుజరాత్ రాష్ట్రం ‘ప్రభాస్ పటాన్’ అనే ప్రదేశాన్ని పావనం చేస్తోంది. దేశంలోని 12 జ్యోతిర్లింగాల (పాశస్త్యాన్ని ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ప్రస్తుతిస్తుంది. ‘సౌరాష్ట్రీ సోమనాథం చ…” అంటూ ఆరంభమయ్యే ఈ స్తోత్రం, తొలి జ్యోతిర్లింగ నెలవుగా సోమనాథ్ నాగరికత, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా ఈ శ్లోకం జ్యోతిర్లింగ మహత్తును ఇలా చాటి చెబుతుంది. అంటే సోమనాథ్ శివలింగ దర్శన మాత్రాన సోమలింగం నరో దృష్ట్వా సర్వపాపైః ప్రముచ్యత్ లభతే ఫలం మనోవాంఛితం మృతః స్వర్గం సమాశ్రయేత్ అంటే సోమనాథ్ శివలింగ దర్శన మాత్రాన జీవుడు పాపవిముక్తుడై సదాశయాలను నెరవేర్చి, మరణానంతరం స్వర్గ ప్రాప్తినొందుతాడు” అని అర్థం. కానీ, లక్షలాది భక్తజనం భక్తిప్రపత్తులతో నీరాజనాలు అర్పించిన ఈ సోమనాథ్ పై దురదృష్టవశాత్తూ విధ్వంసమే ఏకైక ధ్యేయంగా విదేశీ దురాక్రమణదారులు దండయాత్రలు చేశారు. ఈ నేపథ్యంలో సోమనాథ ఆలయానికి (Somnath Temple) 2026 సంవత్సరం ప్రత్యేకమై నది. ఈ ఇతిహాసిక పుణ్యక్షేత్రంపై తొలి దాడికి ఈ ఏడాదిలో వెయ్యేళ్లు పూర్తవుతున్నాయి. గజనీ మహమ్మద్ 1026 జనవరిలో క్రూర, హింసాత్మక దండయాత్రలో భాగంగా ఈ ఆలయంపై దాడి చేశాడు. ప్రజల భక్తివిశ్వాసాలకు,నాగరికతకు సుసంపన్న ప్రతీక అయిన ఈ ఆలయాన్ని ధ్వంసం చేయజూశాడు. అయితే, సోమనాథ్కు పూర్వ వైభవందిశగా ఏళ్లపాటు సాగిన అవిరళ కృషి ఫలితంగా వెయ్యేళ్ల తర్వాత కూడా ఈ ఆలయ దివ్యదీప్తి ప్రపంచవ్యాప్తంగా ప్రకాశిస్తోంది.

Read Also: http://Medaram Jatara: 28 నుంచి 31 వరకు మహాజాతర

Somnath Temple

75 సంవత్సరాలు పూర్తవుతాయి

ఇటువంటి ప్రయత్నాల్లో ఒక ఘట్టానికి 2026లో 75 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ మేరకు ఆలయ పునరుద్ధరణ అనంతరం 1951 మే 11వ తేదీన అప్పటి రాష్ట్ర పతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ సమక్షాన నిర్వహించిన కార్య క్రమంలో భక్తులకు జ్యోతిర్లింగ భాగ్యం కల్పిస్తూ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. సోమనాథ్పై వెయ్యేళ్ల నాటి తొలి దండయాత్ర, అక్కడి దురాక్రమణదారుల క్రూరత్వం, పుణ్యక్షేత్ర విధ్వంసం వంటి అమానుష ఘట్టాలను వివిధ చారిత్రక గ్రంథాలు సవివరంగా నమోదు చేశాయి. వాటిని చదివే ప్రతి పాఠకుడి గుండె విలవిలలాడుతూ లిప్తపాటు విచలితమవుతుంది. ప్రతి పంక్తిలోనూ బట్టబయలయ్యే హింస, క్రూరత్వం వెయ్యేళ్లు గడిచినా మరపురాని విషాద భారాన్ని మన మనోఫలకంపై మోపుతాయి. భారత దేశం పైన, ప్రజల మనోధైర్యం మీద అది చూపిన పెను దుష్ప్ర భావాన్ని ఒకసారి ఊహించండి. సముద్ర తీరంలోగల సోమనాథ్ ఆలయం (Somnath Temple) అమేయ ఆర్థిక శక్తితో సమాజానికి సాధికారతనిచ్చింది. అన్నింటినీ మించి సోమనాథ్కు విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. నాటి సమాజంలోని సముద్ర వ్యాపారులు,నావికులు సోమనాథ్ వైభవ గాథలను దేశ దేశాలకు విస్తృతంగా మోసుకెళ్లారు. అయినప్పటికీ, తొలి దాడికి సహస్రాబ్ది పూర్తయ్యాక కూడా సోమనాథ్ గాథ విధ్వంస నిర్వచనంగా నిలవకపోవడంపై నిస్సందేహంగా నేనెంతో గర్విస్తున్నాను.

ధైర్యానికి నిర్వచనం

ఈ ఆలయం ఈనాడు భరతమాత కోట్లాది బిడ్డల అఖండ ధైర్యానికి నిర్వచనంగా నిలుస్తోంది. ఎన్నడో వెయ్యేళ్ల కిందట 1026లో మొదలైన మధ్యయుగ పు అనాగరిక దండయాత్ర, ఇతరులను కూడా సోమనాథ్ పదేపదే దాడులకు ప్రేరేపించింది. దేశ ప్రజలను, సంస్కృ తిని దాస్య శృంఖలాల్లో బంధించే ప్రయత్నాలకు నాంది పలికింది. కానీ, ఆలయంపై దాడి జరిగిన ప్రతి సందర్భం లోనూ రక్షణ కుడ్యంలా నిలిచి, ఆత్మార్పణకూ వెరవని వీర పుత్రులు, పుత్రికలు ఎందరో ఉన్నారు. దాడి జరిగిన ప్రతి సారి మనదైన గొప్ప నాగరికతకు వారసులుగా వారు పుంజు కుంటూ తరతరాలుగా ఆలయ పునర్నిర్మాణం, పునరుజ్జీవ నానికి పాటుపడుతూనే వచ్చారు. ఇటువంటి మహనీయుల లో అహల్యాబాయి హోల్కర్ ప్రముఖులు. సోమ్నాథ్ భక్తులు ప్రార్థనలు చేసుకునేలా ఆమె అందించిన అవిరళ కృషి వెలకట్టలేనిది. అటువంటి మహానుభావులు జీవించిన నేలపై నడయాడగలగటం నిజంగా మన అదృష్టం. స్వామి వివేకానంద 1890 దశకంలో సోమనాథ్ను సందర్శించినపుడు అనిర్వచనీయ అనుభూతికి లోనయ్యారు. నాటి తన అనుభవాన్ని 1897లో చెన్నై నగరంలో ఓ కార్యక్రమం సందర్భంగా దక్షిణ భారతంలోని ప్రాచీన ఆలయాలతో పాటు గుజరాత్లోని సోమనాథ్ వంటివి మనకు అపార జ్ఞానప్రదాతలు. ఎన్నో పుస్తకాలు వివరించలేని జాతి చరిత్రపై మనకు మరింత లోతైన అవగాహనను అందిస్తాయి. వంద దాడులను భరించిన గుర్తులతోనే కాకుండా వంద పునరుజ్జీ వన చిహ్నాలతో ఈ ఆలయాలు ఎంత వైభవంగానిలిచాయో గమనించండి. నిరంతర విధ్వంసం, శిథిలాల నుంచి నిరం తర పునరుజ్జీవనంతో మునుపటి ఠీవితో ఎంతశక్తిమంతంగా విలసిల్లుతున్నాయో చూడండి! అదే జతీయ మనోభావన.. జాతీయ జీవన స్రవంతి. అనుసరిస్తే అది అమేయ యశస్సు వైపు మనల్ని నడిపిస్తుంది. ఆ జీవన స్రవంతిని వీడితే ఫలితం మరణమే! ఆ మార్గం వదిలిపెడితే ప్రభావం ఆత్మ నాశనం, వినాశమే!”

చరిత్ర పుటల్లో

స్వాతంత్య్రానంతరం సమర్థుడైన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ పవిత్ర బాధ్యతను స్వీకరించారు. 1947లో దీపా వళి వేళ ఆ ప్రాంతంలో ఆయన పర్యటించారు. అక్కడి పరి స్థితులను చూసి చలించిపోయిన సర్దార్పటేల్.. అక్కడే ఆలయాన్ని పునర్నిర్మిస్తామని ప్రకటించారు. చివరికి 1951 మే 11న సోమనాద్లో భవ్యమైన ఆలయ ద్వారాలు భక్తుల కోసం తెరచుకున్నాయి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆవేడుకకు హాజరయ్యారు. ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించాలని కలలు గన్న యోధుడు సర్దార్ సాహెబ్ ఆ సమయానికి భౌతికంగా ఈ లోకంలో లేరు. కానీ, ఆయన స్వప్నం సాకారమై దేశం ఎదుట సగర్వంగా నిలిచింది. నాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్నెహ్రూ ఈపరిణామం పట్ల అంతగా ఉత్సాహం చూపలేదు. ఎంతో విశిష్టమైన ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్రపతి, మంత్రులు పాల్గొనడం ఆయనకు ఇష్టం లేదు. ఈ కార్యక్రమం భారత్పై ప్రతికూల ముద్ర వేసిందని నెహ్రూ వ్యాఖ్యానించారు. కానీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తన నిర్ణయానికి దృఢంగా కట్టుబడి ఉన్నారు. అనంతర పరిణామాలు చరిత్ర పుటల్లో నిలిచే ఉన్నాయి. సర్దార్ పటేల్ కు ఎంతో అండగా నిలిచిన కె.ఎం. మునీని స్మరించుకోక పోతే సోమనాథ్ గాథ అసంపూర్ణమే అవుతుంది. సోమనాథ: నిత్య క్షేత్రం (సోమనాథ: ది ప్రైన్ ఎటర్నల్) గ్రంథంతో పాటు.. సోమనాథ్ప ఎన్నో సమాచారభరిత, విజ్ఞానదాయ కమైన రచనలు చేశారు. నిజానికి, మున్నీతన గ్రంథ శీర్షిక లో చెప్పినట్టు.. ఆత్మ నిత్యత్వాన్నీ, ఉన్నత భావాల శాశ్వత త్వాన్నీ బలంగా విశ్వసించే గొప్ప నాగరికత మనది. ‘నైనం ఛిందని శస్త్రాని’ అని గీతలో చెప్పినట్టు -‘అది ధ్వంసం చేయశక్యం గాని అజరామరత్వమని మనం బలంగా నమ్ముతాం. మన నాగరికత అజేయ స్ఫూర్తికి సోమనాథ్ను మించిన ఉదాహరణ మరొకటి లేదు. ఎన్నో అవరోధాలనూ, ఆటుపోట్లనూ ఎదుర్కొని వైభవోపేతంగా నిలిచిన సోమనాథ్ కన్నా మిన్నగా మరేది దీన్ని వివరించగలదు? వందల ఏళ్ల దాడులనూ, వలసవాద దోపిడీనీ తట్టుకొనినిలబడి.. నేడు ప్రపంచ వృద్ధిలో అత్యంత ఆశాజనకమైన దేశంగా ఎదిగిన భారత ప్రగతిలోనూ ఇదే స్ఫూర్తి తొణికిసలాడుతోంది. నేడు భారత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందంటే మన విలువలు, భారతీయుల దృఢ సంకల్పమే దానికి మూలం.

Somnath Temple

ప్రపంచం ఆశతో

ప్రపంచం ఆశతో, ఆశాభావంతో భారత్కు చూస్తోంది. సృజనాత్మకత నిండిన మన యువతపై విశ్వాసంతో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. మన కళ, సంస్కృతి, సంగీతం, పండుగలు ఇప్పుడు విశ్వ వ్యాప్తమవుతున్నాయి. యోగా, ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతూ, ఆరోగ్య కరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొన్ని అత్యంత తీవ్రమైన సవాళ్లకు భారత్ పరి ష్కారాలను చూపుతోంది. అనాది కాలం నుంచి వివిధ వర్గాల ప్రజలను సోమనాథ్ ఏకంచేస్తోంది. శతాబ్దాల కిందటే పూజ్య జైన సన్యాసి కలికాల సర్వజ్ఞ హేమచంద్రాచార్యులు సోమనాథ్కు వచ్చారు. అక్కడ ప్రార్థన భవబీజాంకురజననా రాగాధ్యాః క్షయముపగతా యస్య అనే శ్లోకాన్ని ఆయన చెప్పాడంటారు. అంటే – లౌకిక కర్మ బీజాలను నశింపజేసే వాడికీ.. రాగద్వేషాలనూ, సమస్తక్లేశాలనూ తుడిచిపెట్టే వాడికీ వందనాల్గు అని అర్థం. నేడు మన మన స్సులోనూ, ఆత్మలోనూ ఒక బలమైన చైతన్యాన్ని రగిలించే అద్భుత శక్తిసోమనాథ్కు ఉంది. 1026లో మొదటిసారి దాడి జరిగి వెయ్యేళ్లు గడిచినా.. సోమనాథ్ వద్ద సాగరం నేటికీ, అంతే గంభీరంగా గర్జిస్తోంది. సోమనాథ్ తీరాన్ని తాకే అలలు అద్బుతమైన కథను చెబుతున్నాయి. ఆటంకా లెన్నెదురైనా ఆ అలల మాదిరిగానే మళ్లీ సోమనాథ అభ్యు దయం తథ్యం. నాటి దురాక్రమణదారులు నేడు గాలిలో కలిసిన ధూళి కణాలయ్యారు. వారి పేర్లు విధ్వంసానికి పర్యాయపదాలుగా మిగిలాయి. వారంతా చరిత్ర గ్రంథాల్లో పాదసూచికలు మాత్రమే. సోమనాథ్ మాత్రం దిగంతాలకు అతీతంగా వేదీప్యమై వెలుగులు విరజిమ్ముతోంది. 1026 నాటి దాడితో ఏమాత్రమూ చెక్కుచెదరని ఆ అజేయమైన, చిరతరమైన స్ఫూర్తిని మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. సోమనాథ్ ఒక ఆశా గీతం. ద్వేషం, మతోన్మాదాలకు తాత్కా లికంగా ధ్వంసం చేసేశక్తి ఉండవచ్చు. కానీ సత్యమూ, ధర్మం పై అచంచలమైన విశ్వాసమూ అమరత్వాన్ని సృజించగల వని సోమనాథ్ వాటుతోంది. వెయ్యేళ్ల కిందట దాడికి గురై, తర్వాత కూడా నిరంతర దాడులను ఎదుర్కొన్న సోమనాథ ఆలయం మళ్లీ మళ్లీ సగర్వంగా నిలిచినట్టే.. మనం కూడా పరాయి దండయాత్రలకు ముందున్న, వెయ్యేళ్ల కిందటి మన దేశ మహా వైభవాన్ని పునరుద్దరించుకుని తీరుతాం. శ్రీ సోమనాథ్ మహాదేవుడి ఆశీస్సులతో, వికసిత భారత నవ సంకల్పంతో మనం ముందుకు సాగుతున్నాం. విశ్వ కల్యాణమే పరమావధిగా.. మన నాగరికతా స్ఫూర్తి దిశా నిర్దేశం చేస్తోంది. జై సోమనాథ్.
-ప్రధాని నరేంద్రమోడీ, సోమనాథ్ ట్రస్టు చైర్మన్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Hindu Temples Indian heritage latest news Pilgrimage Somnath Temple Spirituality Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.