రాత్రి వేళ సంభవిస్తుండడంతో భారత్ లో కనిపించని వైనం
హైదరాబాద్ (Hyderabad) : ఈ నెల ఏడవ తేదీన భారత్ సహా అనేక దేశాలను కనువిందు చేసిన సంపూర్ణ చంద్ర గ్రహణం గురించి ప్రజలు ఇంకా మరచిపోక ముందే ఇదే నెల 21వ తేదీన సూర్య గ్రహణం ఏర్పడనుంది. భాద్రపద అమావాస్య రోజున సూర్య గ్రహణం (solar eclipse) ఏర్పడడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఈ అమావాస్య రోజున హిందువులు పితృకర్మలు చేయడం ఆనవాయితీ. ఇదే రోజున సూర్య గ్రహణం సంభవించబోతోంది. అయితే ఈ గ్రహణం భారత్ లో కనిపించడం లేదు.
solar eclipse
భారత కాలమానం ప్రకారం
భారత కాలమానం ప్రకారం రాత్రి 10.59గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారూజామున 3.23 గంటల వరకు ఈ గ్రహణం వుంటుంది. ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం (solar eclipse) ఇదే కావడం గమనార్హం. దీని తరువాత 2027 ఆగస్టు రెండవ తేదీన సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడనుంది, కాగా ఈ నెల 21వ తేదీన సంభవించనున్న సూర్య గ్రహణం ఆస్ట్రేలియా, న్యూజీలాండ్,(New Zealand) అట్లాంటిక్, అంటార్కిటికా, పసిఫిక్ మహా సముద్రం ప్రాంతాలలోనే కనిపించనుంది. ఈ గ్రహణం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం భారత్ లో కనిపించనందున సూతకాలం వుండబోదని ఆగమన పండితులు చెబుతున్నారు.
Q1: ఈ నెలలో సూర్య గ్రహణం ఎప్పుడు జరుగుతుంది?
A1: ఈ నెల 21వ తేదీ భాద్రపద అమావాస్య రోజున సూర్య గ్రహణం ఏర్పడుతుంది.
Q2: ఈ గ్రహణం భారత్‌లో కనిపిస్తుందా?
A2: కాదు. ఈ సూర్య గ్రహణం భారత్‌లో కనిపించదు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: