కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ (Smriti Irani) మళ్లీ బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇస్తోంది. క్యోంకి సాస్ బీ కబీ బహు తి (Kyunki Saas Bhi Kabhi Bahu Thi) సీరియల్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి రాకముందు .. ఆమె ఇదే టీవీ సీరియల్‌లో నటించిన విషయం తెలిసిందే. అయితే ఫుల్ టైం రాజకీయాల్లోకి వచ్చాక ఆమె ఆ షోకు బ్రేక్ వేసింది. ఇప్పుడు మళ్లీ అదే సీరియల్‌తో బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యింది. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఇప్పటికే రిలీజ్ అయ్యింది. అయితే, ఇప్పుడు ఈ సీరియల్‌లో ఆమె పారితోషికం గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
క్యోంకి సాస్ బీ కబీ బహు తీ సీరియల్ 2000 నుంచి 2008 మధ్య ప్రసారమైంది. ఏడేళ్ల పాటు వరుసగా ఆ సీరియల్ నెంబర్ వన్ స్పాట్‌లో ఉన్నది. అప్పట్లో ఆమె ఈ సీరియల్ కోసం ఎపిసోడ్‌కు రూ.1,800 పారితోషికంగా తీసుకున్నారు. ఇప్పుడు ఆ మొత్తం భారీగా పెరిగినట్లు తెలిసింది. ఒక్కో ఎపిసోడ్‌కు ఏకంగా రూ.14 లక్షలు తీసుకుంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఈ మొత్తంపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. పలు మీడియా నివేదికల ప్రకారం.. తన రీఎంట్రీ సిరీస్‌లో స్మృతి (Smriti Irani) ఒక్కో ఎపిసోడ్‌కు రూ.14 లక్షలు పారితోషికంగా అందుకోనున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది.
పార్లమెంట్‌కు ఎన్నిక కావడం
తులసీ వీర్వాని పాత్రలో స్మృతి ఇరానీ నటిస్తోంది. ఫస్ట్ లుక్ డ్రెస్సులో.. స్మృతి(Smriti Irani) మెరూన్ రంగు చీరలో ఉన్నది. జరీ పట్టు బోర్డర్ ఉన్న చీరను ఆమె ధరించింది. చాలా పెద్ద సైజులో ఉన్న ఎరుపు రంగ బొట్టు పెట్టుకున్నది. బంగారు ఆభరణంతో పాటు బ్లాక్ బీమ్ మంగళసూత్రాన్ని ఆమె ధరించింది. వీ ద వుమెన్ షోలో బర్కా దత్త, కరణ్ జోహార్ తో మాట్లాడుతూ తన పాత్ర గురించి ఆమె తెలిపారు.
క్యోంకి సాస్ బీ కబీ బహు తీ షోలో నటించాలన్న ఒప్పందం ఉందని, 2014లో మళ్లీ ఆ సిరీయల్ చేయాలన్న ఒప్పందం ఉంది అని, కానీ పార్లమెంట్‌కు ఎన్నిక కావడం వల్ల టీవీ షో ఒప్పందాన్ని బ్రేక్ చేయాల్సి వచ్చిందన్నారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయాలని పీఎంవో ఆఫీసు నుంచి కాల్ రాగానే తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ఆమె వెల్లడించారు. టీవీ, సినిమాల్లో నటించడం కన్నా.. దేశానికి సేవ చేయడం గొప్ప విషయం అవుతుందని రిషి కపూర్ చెప్పిన మాటల్ని ఆమె గుర్తు చేశారు.
స్మృతి ఇరానీ హిందువునా?
ఆమె స్మృతి మల్హోత్రాగా జన్మించింది, సగం పంజాబీ, సగం మహారాష్ట్ర హిందూ తండ్రి అజయ్ కుమార్ మల్హోత్రా మరియు బెంగాలీ హిందూ తల్లి షిబానీ నీ బాగ్చి దంపతుల కుమార్తె. ఆమె ముగ్గురు సోదరీమణులలో పెద్దది.
స్మృతి ఇరానీ మిస్ ఇండియా అయ్యిందా?
స్మృతి ఇరానీ 1999 మిస్ ఇండియా ప్రయాణానికి ఒక तुवाली — క్యుంకీ సాస్ భీ కభీ బహు థిలో తులసిగా ఇంటి పేరుగా మారడానికి ముందు ఆమె తొలి రోజుల సంగ్రహావలోకనం. పోటీల గ్లామర్ నుండి టెలివిజన్ ప్రపంచం వరకు మరియు ఇప్పుడు భారత రాజకీయాల్లో ప్రముఖ ముఖంగా, ఈ మహిళ ప్రతిదీ చేసింది
Read hindi news:hindi.vaartha.com