ఈ ఏడాది కొత్తగా స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ లేదా టీవీ కొనాలనుకునే వినియోగదారులకు బిగ్ షాక్. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న తీవ్రమైన మెమరీ చిప్‌ల కొరత కారణంగా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ ఈ సమస్యకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. చిప్ తయారీ సంస్థలు అధిక లాభాలు అందించే ఏఐ సంబంధిత ఉత్పత్తుల వైపు దృష్టి మళ్లించడంతో సాధారణ వినియోగదారులకు అవసరమైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల ఉత్పత్తి తీవ్రంగా ప్రభావితమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ డేటా సెంటర్ల నిర్మాణం వేగంగా పెరుగుతోంది. దీనికి అవసరమైన aహై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ కోసం హై-బ్యాండ్‌విడ్త్ మెమరీ (HBM) చిప్‌లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ పరిస్థితిలో శాంసంగ్, ఎస్‌కే హైనిక్స్ వంటి ప్రముఖ మెమరీ చిప్ తయారీ కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రధానంగా హెచ్‌బీఎం చిప్‌ల తయారీకే కేటాయిస్తున్నాయి. దీంతో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే డీ-ర్యామ్ (DRAM), నాండ్ (NAND) ఫ్లాష్ మెమరీ చిప్‌లకు తీవ్ర కొరత ఏర్పడింది.
Read Also: TG: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఇంకెంత కాలం విచారిస్తారన్న సుప్రీంకోర్టు
కొన్ని రకాల మెమరీ చిప్‌ల ధరలు 50 నుంచి 60 శాతం వరకు పెరిగాయి
ఈ కొరత ప్రభావం ఇప్పటికే చిప్ ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని రకాల మెమరీ చిప్‌ల ధరలు 50 నుంచి 60 శాతం వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పెరిగిన ఖర్చును పూర్తిగా కంపెనీలు భరించలేకపోవడంతో.. చివరకు వినియోగదారులపైనే ధరల భారం పడనుంది. రాబోయే రెండు నెలల్లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీల ధరలు సగటున 4 నుంచి 8 శాతం వరకు పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీలో కోడి పందేల జాతర.. రూ. 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం.. ఆ ఒక్క జిల్లాలోనే.. ఈ ప్రభావం ఇప్పటికే భారత మార్కెట్‌లో కనిపించడం మొదలైంది. వివో, నథింగ్ వంటి కొన్ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను రూ.4 వేల నుంచి నుంచి రూ. 5 వేల వరకు పెంచాయి. ఇదే పరిస్థితి ముందు ముందు కొనసాగితే.. 2026 సంవత్సరంలో మొబైల్ ఫోన్ అమ్మకాలు 11 నుంచి 14 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (AIMRA) హెచ్చరిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: