సెమీకండక్టర్ల పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న(smart Phones) కొరత తాత్కాలిక సమస్య కాకుండా, ఏఐ (AI) టెక్నాలజీ వైపు భారీగా మళ్లిన పరిశ్రమ మార్పుల కారణంగా ఏర్పడిన దీర్ఘకాలిక ప్రభావంగా నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మెమరీ, స్టోరేజ్ చిప్‌ల కొరత ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్ల ధరలను భారీగా పెంచుతోంది. 256GB నుండి 1TB వరకు స్టోరేజ్ మాడ్యూల్స్ ధరలు 20% నుండి 60% వరకు పెరిగాయి. పరిశ్రమ పాత టెక్నాలజీని తగ్గిస్తున్నందున 512GB మాడ్యూల్స్ ధరలు 65% పెరిగాయి. DRAM మాడ్యూల్స్ కూడా 18%–25% వరకు ఖరీదయ్యాయి. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం మెమరీ చిప్ ధరలు ఈ ఏడాది ఇప్పటికే 50% పెరిగాయని, 2025 చివరి నాటికి మరో 30% పెరుగుదల ఉండే అవకాశం ఉందని చెబుతోంది. AI చిప్‌ల తయారీపై ఎక్కువ దృష్టి పెట్టడంతో మెయిన్‌స్ట్రీమ్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు అవసరమైన మాడ్యూల్స్ సరఫరా తగ్గిపోయింది, దీని ప్రభావం మార్కెట్లో స్పష్టంగా కనిపిస్తోంది.
Read also: భారత్ లో అమెజాన్ భారీ ఇన్వెస్ట్‌మెంట్
స్మార్ట్‌ఫోన్‌లు–PCల ధరలపై భారీ ఒత్తిడి
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లే కాకుండా మిడ్‌రేంజ్, హై–ఎండ్ పరికరాలపై కూడా ధరల ఒత్తిడి పెరుగుతోంది. Vivo, Oppo, Realme, Transsion వంటి కంపెనీలు(smart Phones) ఇప్పటికే ధరలను ₹500–₹2000 వరకు పెంచాయి. కొత్త మోడల్స్ 10% వరకూ అధిక ధరలతో రావచ్చని రిటైలర్లు చెబుతున్నారు. డెస్క్‌టాప్ PCలు, నోట్‌బుక్‌ల ధరలు కూడా పెరుగుతున్నాయి. తయారీ ఖర్చులు 15% పైగా పెరగడంతో Dell, Asus, Lenovo, HP వంటి దిగ్గజాలు కూడా ధరల పెంపు వైపు మొగ్గు చూపుతున్నాయి. కొందరు తయారీదారులు ముందస్తుగా స్టోరేజ్ నిల్వలు పెంచుకుంటున్నా, తక్షణంలో ధరలు తగ్గే అవకాశం కనిపించడం లేదు. AI రంగంపై పరిశ్రమ దృష్టి పెరగడం వల్ల సాధారణ వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ ఖరీదవుతుండగా, సెమీకండక్టర్ సరఫరా గొలుసులో భారీ పెట్టుబడులు ఉన్నప్పుడే ఈ సంక్షోభం తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: