Latest Telugu News : SIR : తమిళనాడులోనూ ‘సర్’‌..

Read Time:  1 min
SIR
SIR
FONT SIZE
GET APP

బీహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) రాజకీయంగా తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ‘సర్‌’కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఎస్‌ఐఆర్‌ పేరుతో బీహార్‌లో పెద్ద ఎత్తున ఎన్నికల రిగ్గింగ్‌ జరుగుతోందని ఆరోపించాయి. అయితే, ప్రతిపక్షాల ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండించింది. అక్రమ వలసదారులను తొలగించడంతో పాటు ఓటరు జాబితాల సమగ్రతను కాపాడడమే సర్‌ ప్రాథమిక లక్ష్యమని ఈసీ పేర్కొంటున్నది. అంతేకాదు, దశలవారీగా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) చేపట్టనున్నట్లు ఇటీవలే ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే తమిళనాడు లోనూ ‘సర్‌’ నిర్వహించనున్నట్లు ఈసీ తాజాగా తెలిపింది. ఒక వారం రోజుల్లో రాష్ట్రంలో ఇది ప్రారంభం అవుతుందని శుక్రవారం మద్రాస్‌ హైకోర్టుకు తెలిపింది.

Read Also : Jaishankar:స్వేచ్ఛా హక్కులపై ఐరాస సూచన.. భారత్‌ స్పందన

SIR
SIR

అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ శాసనసభలకు 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బిహార్‌లో సర్‌ ప్రక్రియ పూర్తయ్యింది. 7.472 కోట్ల పేర్లతో తుది జాబితాను సెప్టెంబర్‌ 30న ఈసీ ప్రచురించింది. అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల సవరణను ప్రారంభించే పని జరుగుతోందని.. ప్రారంభంపై తుది నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకుంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఇటీవలే తెలిపారు.

SIR ఎలక్టోరల్ రోల్ అంటే ఏమిటి మరియు అది ఎందుకు ముఖ్యమైనది?

ECI బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్టోరల్ రోల్స్ యొక్క తుది ముసాయిదాను విడుదల చేసింది. భారతదేశంలో ఒక ప్రత్యేకమైన ఓటరు జాబితా ధృవీకరణ ప్రక్రియ అయిన SIR ఎలక్టోరల్ రోల్‌ను మరియు సమగ్ర ఓటరు ధ్రువీకరణ ద్వారా ఖచ్చితమైన, మోసం లేని ఎన్నికలను నిర్ధారించడంలో దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.