బారామతి: మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. బారామతి ప్రాంతంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar Death) సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారికంగా ధృవీకరించింది.
Read Also: Ajit Pawar: అజిత్ పవార్ మృతి పై ప్రధాని మోదీ, అమిత్ షా దిగ్భ్రాంతి
ప్రమాదం జరిగిన తీరు
డీజీసీఏ సమాచారం ప్రకారం.. ఈ రోజు ఉదయం 8.45 గంటల ప్రాంతంలో విమానం అదుపుతప్పి కుప్పకూలింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో అజిత్ పవార్‌తో పాటు ముగ్గురు ఉన్నతాధికారులు, ఇద్దరు పైలట్లు ఉన్నారు. దురదృష్టవశాత్తు విమానంలోని వారందరూ అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
కాలిబూడిదైన విమానం
ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో విమానం నేలకూలిన వెంటనే మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే విమానం పూర్తిగా కాలిబూడిదైంది. ఘటనా స్థలంలో దృశ్యాలు అత్యంత భీతావహంగా ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి మృతదేహాలను వెలికితీసే ప్రయత్నం చేశాయి. ఈ హఠాత్పరిణామంతో మహారాష్ట్ర వ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: