Gujarat High Court : తీరిగ్గా బీరు తాగుతూ కనిపించిన న్యాయవాది!

Read Time:  1 min
Gujarat High Court : తీరిగ్గా బీరు తాగుతూ కనిపించిన న్యాయవాది!
FONT SIZE
GET APP

గుజరాత్ హైకోర్టు(Gujarat High Court)లో విచారణ జరుగుతుండగా ఓ సీనియర్ న్యాయవాది ప్రవర్తన పెద్ద దుమారాన్ని రేపింది. వర్చువల్ హియరింగ్‌లో పాల్గొంటున్న సమయంలో ఆయన బీర్ తాగుతూ (Drinking beer), ఫోన్‌లో మాట్లాడుతున్న వీడియో బయటకు వచ్చింది. ఇది న్యాయవ్యవస్థ గౌరవాన్ని తుంచేసిందని కోర్టు మండిపడింది.జూన్ 25న జస్టిస్ సందీప్ భట్ ధర్మాసనం ముందు సీనియర్ కౌన్సిల్ భాస్కర్ తన్నా వాదనలు వినిపించాల్సి ఉంది. కానీ ఆయన కెమెరా ముందు బీర్ తాగుతూ కనిపించారు. మరోవైపు ఫోన్‌ మాట్లాడుతున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై కోర్టు వెంటనే స్పందించింది.

Gujarat High Court : తీరిగ్గా బీరు తాగుతూ కనిపించిన న్యాయవాది!
Gujarat High Court : తీరిగ్గా బీరు తాగుతూ కనిపించిన న్యాయవాది!

ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు.. న్యాయవాది ప్రవర్తన దారుణం

వీడియోను పరిశీలించిన జస్టిస్ ఏఎస్ సుపేహియా, జస్టిస్ ఆర్‌టీ వచానిల ధర్మాసనం తన్నా ప్రవర్తనను తీవ్రమైన చర్యలుగా అభివర్ణించింది. ‘‘ఇది న్యాయవ్యవస్థ గౌరవానికి తీవ్రమైన విఘాతం. ఇలాంటి వ్యవహారాలను ఉపేక్షించలేం,’’ అని వ్యాఖ్యానించింది.

స్వయంగా కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభం

తన్నా ప్రవర్తనపై కోర్టు సుమోటోగా ధిక్కరణ చర్యలు ప్రారంభించింది. దీనిపై రిజిస్ట్రీ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తదుపరి విచారణకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.

వర్చువల్ హాజరుపై తాత్కాలిక నిషేధం

ఈ వ్యవహారంపై కోర్టు తన్నాపై తాత్కాలిక నిషేధం విధించింది. ఆయన ఇకపై వర్చువల్ విచారణలకు హాజరుకాలేరు. ఇది కేవలం ప్రస్తుత కేసుల వరకే వర్తిస్తుంది. కోర్టు ధిక్కరణ విచారణను రెండు వారాల్లో చేపట్టనున్నట్లు పేర్కొంది.

Read Also : Srigandham Smuggling : చేవెళ్లలో భారీగా గంధం చెక్కల స్మగ్లింగ్

Divya Vani M

రచయిత గురించి

Divya Vani M

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.