📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Sleeper train: పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు

Author Icon By Saritha
Updated: January 17, 2026 • 3:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రైల్వే ప్రయాణికులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కల నెరవేరింది. దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును (Sleeper train) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం ప్రారంభించారు. త్వరలోనే పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ తొలి వందే భారత్ స్లీపర్ సర్వీసు ఆ రాష్ట్రంలోనే ప్రారంభించారు. బెంగాల్‌లోని హౌరా నుంచి అస్సాంలోని గౌహతి (కామాఖ్య) మధ్య ఈ వందే భారత్ స్లీపర్ రైలు నడవనుంది.

Read also: US: L1 వీసాపై పని లేకుండా అమెరికాలో ఉంటే ఏమవుతుందో తెలుసా?

The first Vande Bharat sleeper train has been rolled out onto the tracks.

రైలు టైమింగ్స్, వివరాలు

ఈ మార్గంలో ప్రస్తుతం నడుస్తున్న వేగవంతమైన రైలు అయిన సరైఘాట్ ఎక్స్‌ప్రెస్ కంటే ఈ వందే భారత్ స్లీపర్ రైలు సుమారు 3 గంటల తక్కువ సమయంలోనే గమ్యాన్ని చేరుకుంటుంది. (Sleeper train) హౌరా నుంచి గౌహతి మధ్య ఉన్న 958 కిలోమీటర్ల దూరాన్ని ఈ వందే భారత్ స్లీపర్ కేవలం 14 గంటల్లోనే కవర్ చేస్తుంది. ఈ వందే భారత్ స్లీపర్ గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ ప్రస్తుతం 130 కిలోమీటర్ల వేగంతోనే నడపనున్నారు.

సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు హౌరాలో బయలుదేరనున్న ఈ వందే భారత్ స్లీపర్ రైలు మరుసటి రోజు ఉదయం 8 గంటల 20 నిమిషాలకు కామాఖ్య స్టేషన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కామాఖ్యలో సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటల 15 నిమిషాలకు హౌరాకు చేరుకుంటుంది. హౌరా నుంచి గురువారం తప్ప మిగిలిన 6 రోజులు కామాఖ్య నుంచి బుధవారం తప్ప మిగిలిన 6 రోజులు ఈ వందే భారత్ స్లీపర్ రైలు నడుస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:



Howrah Guwahati Train Indian Railways Latest News in Telugu Narendra Modi Sleeper Train Launch Telugu News Vande Bharat Sleeper West Bengal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.