పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ తన వైఖరిని మరింత గట్టిగా చూపిస్తోంది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేతతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవన్నీ పాక్ ప్రభుత్వాన్ని బాగా కుదిపేశాయి. అయితే, పాకిస్థాన్ నేతలు భారతంపై మండిపడుతూ తీవ్ర హెచ్చరికలు చేస్తుంటే, అక్కడి ప్రజలు మాత్రం తమ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ సెటైర్లు వేస్తున్నారు.పహల్గామ్ దాడితో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ముదిరాయి. భారత్ సింధూ జలాల ఒప్పందం అమలు ఆపే అవకాశం ఉందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. దీనిపై పాకిస్థాన్ రక్షణ మంత్రి సహా పలువురు నాయకులు తీవ్రంగా స్పందించారు. “ప్రతి నీటి చుక్క కూడా మాదే. నీళ్లు ఆపితే నదులు రక్తంతో నిండతాయి” అంటూ హెచ్చరించారు.అయితే పాకిస్థాన్ సామాన్యులు మాత్రం ప్రభుత్వ వ్యాఖ్యలను హాస్యంగా తీసుకుంటున్నారు. “భారత్ నీళ్లు ఆపుతుందా? మాకు అసలు నీటి సరఫరా సరిగ్గా లేదు కదా” అంటూ విమర్శిస్తున్నారు. “మా ప్రభుత్వం మమ్మల్ని ఏరోజూ చంపుతూనే ఉంది. భారత్ ఎందుకు అదనంగా చంపాలి?
అంటూ కొందరు తమ ఆవేదనను మీమ్స్ ద్వారా వ్యక్తం చేస్తున్నారు.ఒక నెటిజన్, ఓ వ్యక్తి స్నానం చేస్తుండగా సబ్బు కళ్లల్లో పడి నీళ్లు ఆగిపోయిన ఫోటోను పోస్ట్ చేస్తూ, “భారత్, నీళ్లు వదిలేయ్” అంటూ సరదాగా కామెంట్ చేశాడు. మరోవైపు పెరుగుతున్న ధరల నేపథ్యంలో, “యుద్ధం తొమ్మిది గంటలలోపు ముగించండి, లేదంటే గ్యాస్ ఉండదు” అంటూ ఇంకొకరు సెటైర్లు వేశారు.”మేము పేద దేశంతో పోరాడుతున్నాం. వాళ్లకు ఇది చెప్పాలి” అంటూ పాక్ ప్రభుత్వ వ్యవస్థను వ్యంగ్యంగా విమర్శించారు. పేపర్‌తో తయారు చేసిన ఫైటర్ జెట్ ఫోటోను షేర్ చేస్తూ పాకిస్థాన్ వైమానిక దళాన్ని టార్గెట్ చేశారు.ఈ జోకులు, మీమ్స్, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పాక్ ప్రజలు తమ దేశ ఆర్థిక దుస్థితిని, పెరిగిన ధరలను, కనీస వసతుల లోపాన్ని మీమ్స్ ద్వారా ప్రపంచానికి చూపిస్తున్నారు. ఇది అక్కడి ప్రజల అసంతృప్తిని స్పష్టంగా బయటపెడుతోంది.భారత్ తీసుకుంటున్న కఠిన చర్యలపై పాకిస్థాన్ ప్రభుత్వ మితిమీరిన స్పందన ఒకవైపు ఉంటే, ప్రజల చిలిపి మీమ్స్ మరోవైపు వారి వాస్తవ స్థితిని రివీల్ చేస్తున్నాయి.ఈ పరిస్థితులు చూస్తే, పాకిస్థాన్ ప్రజలలో ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి, ప్రజల ఆక్రోశం, వారి గగ్గోలు పాలకుల చెవుల దాకా వెళ్తాయా? లేదా అన్నదే చూడాల్సిన విషయం.
Read Also : Pope Funeral: ప్రారంభమైన పోప్ అంత్యక్రియలు-ట్రంప్, ముర్ము హాజరు