📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్

Silver Wedding Card: కూతురి పెళ్లి కోసం ఖరీదైన శుభలేఖ

Author Icon By Saritha
Updated: January 20, 2026 • 3:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జైపూర్‌కు (Jaipur) చెందిన శివ్ జోహ్రి, తన కుమార్తె శ్రుతి జోహ్రి వివాహానికి ఏకంగా 3 కిలోల స్వచ్ఛమైన వెండితో ఓ అద్భుతమైన (Silver Wedding Card) శుభలేఖను తయారు చేశారు. దీని విలువ సుమారు రూ. 25 లక్షలు. ఒక్క మేకు లేదా స్క్రూ కూడా వాడకుండా 128 వెండి ముక్కలతో ఈ పత్రికను రూపొందించడం విశేషం.

Read Also: US: గ్రీన్‌లాండ్ నిధులపై ట్రంప్ కన్ను.. ఆ ద్వీపంలో ఏముంది?

సంవత్సరం పాటు శ్రమించి తండ్రే స్వయంగా రూపకల్పన

ఈ వెండి పత్రికపై (Silver Wedding Card) 65 మంది దేవతామూర్తులను అత్యంత సుందరంగా చెక్కారు. పైన వినాయకుడి విగ్రహంతో పాటు “శ్రీ గణేశాయ నమః” అని రాసి ఉంది. గణేశుడికి కుడివైపు పార్వతీదేవి, ఎడమవైపు పరమశివుడు కొలువై ఉండగా, వారి కింద లక్ష్మీదేవి, విష్ణుమూర్తి విగ్రహాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడి జీవిత ఘట్టాలు, విష్ణువు దశావతారాలు, అష్టలక్ష్మి స్వరూపాలు, సూర్యభగవానుడు, వేంకటేశ్వరస్వామి వంటి అనేక దైవ స్వరూపాలు ఈ పత్రికపై దర్శనమిస్తాయి.

Silver Wedding Card

ఈ పత్రికను తానే స్వయంగా ఏడాది పాటు శ్రమించి తయారు చేశానని శివ్ జోహ్రి తెలిపారు. నా కుమార్తె పెళ్లికి బంధువులనే కాదు, దేవతలందరినీ కూడా ఆహ్వానించాలనుకున్నాను. నా బిడ్డకు తరతరాలు గుర్తుంచుకునేలా ఓ కానుక ఇవ్వాలన్నది నా కోరిక. ఆరు నెలల ఆలోచన తర్వాత ఈ ప్రత్యేకమైన శుభలేఖను తయారు చేయాలని నిర్ణయించుకుని, ఏడాది పాటు పనిచేశాను అని ఆయన వివరించారు. పత్రిక మధ్యలో వధూవరులు శ్రుతి జోహ్రి, హర్ష్ సోనీ పేర్లను చెక్కారు. వారి పేర్ల చుట్టూ ఏనుగులు పూల వర్షం కురిపిస్తున్నట్టుగా డిజైన్ చేశారు. లోపలి భాగంలో సంప్రదాయ పత్రికల మాదిరిగానే ఇరు కుటుంబాల సభ్యుల పేర్లను కూడా వెండిపైనే ముద్రించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

3 Kg Silver Jaipur Latest News in Telugu Luxury Wedding Shiv Johri Shruti Johri Silver Wedding Card Telugu News Unique Wedding Invitation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.