Silver jewelry: వెండి ఆభరణాలపై హాల్మార్కింగ్‌ యోచనలో కేంద్రం

Read Time:  1 min
Silver jewelry: వెండి ఆభరణాలపై హాల్మార్కింగ్‌ యోచనలో కేంద్రం
FONT SIZE
GET APP

కేంద్ర ప్రభుత్వం త్వరలో వెండి ఆభరణాలపై హాల్మార్కింగ్ తప్పనిసరి చేయడానికి సిద్ధమవుతోంది. (Silver jewelry) బంగారం మాదిరే, వెండి (Silver) ఉత్పత్తుల స్వచ్ఛతను నిర్ధారించడమే ప్రధాన ఉద్దేశం. వెండి ధరలు క్రమంగా పెరుగుతుండటం, కొనుగోలుదారులు నష్టపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలో కీలక ప్రకటన చేయనుంది.

Read also: KCR : ‘మా కేసీఆర్ సారును మంచిగ చూస్కోండ్రి’

Silver jewelry: వెండి ఆభరణాలపై హాల్మార్కింగ్‌ యోచనలో కేంద్రం

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) డైరెక్టర్ సంజయ్ గార్గ్ వివరాల ప్రకారం, హాల్మార్కింగ్ వల్ల వెండి ఆభరణాల లోని అసలు వెండి శాతం, స్వచ్ఛత ధృవీకరించవచ్చు. (Silver jewelry) అలాగే, నకిలీ వెండి ఆభరణాల వ్యాపారాన్ని అరికట్టడంలో కూడా ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హాల్మార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, వార్షికంగా వెండి హాల్మార్క్ చేసిన ఆభరణాల సంఖ్యను పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

కొత్త నియమాలు అమల్లోకి వచ్చిన తర్వాత, వినియోగదారులు మాత్రమే కాక, ఆభరణ తయారీదారులు కూడా నిబంధనలను పాటించడం తప్పనిసరి అవుతుంది. ప్రభుత్వం నిబంధనలను క్రమంగా అమలు చేస్తూ, పర్యవేక్షణలో భాగంగా ఆభరణాల స్వచ్ఛతను, నకిలీ ఉత్పత్తుల పై నియంత్రణను పెంచనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.