కర్ణాటక లో సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah), డిప్యూటీ సీఎం డికే శివకుమార్ మధ్య సీఎం కుర్చీ కోసం రాజుకున్న వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో.. కాంగ్రెస్ పార్టీ నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఐక్యతను చాటుకోవాలని సూచించింది. దాంతో ఇప్పటికే సిద్ధరామయ్య ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ ముగిసింది. ఇవాళ డీకే శివకుమార్ రెండో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ కూడా నిర్వహించారు. ఆ సమావేశం అనంతరం సిద్ధరామయ్య (Siddaramaiah) మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ అధిష్ఠానం ప్రకటిస్తే డీకే శివకుమార్ సీఎం అవుతాడని అన్నారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఇద్దరం కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని చెప్పారు. ఇద్దరికీ హైకమాండ్ ఆదేశాలే శిరోధార్యమని, ఎవరు ఎప్పుడు ఏ పదవిలో ఉండాలనే విషయాన్ని అధిష్ఠానమే నిర్ణయిస్తుందని సిద్ధరామయ్య తెలిపారు.
Read Also: Bangladesh: షేక్ హసీనాకు మరో కేసులో ఐదేళ్ల జైలు శిక్ష
సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం పదవి కోసం విభేదాలు నెలకొన్నాయని గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. ఒక దశలో సీఎం, డిప్యూటీ సీఎం సోషల్ మీడియాలో పోటీపోటీగా పోస్టులు పెట్టుకునే స్థాయికి గొడవ చేరింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన హైకమాండ్ ఆదేశాలతో నేతలిద్దరూ వెనక్కి తగ్గారు. హైకమాండ్ సూచన మేరకు బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లు నిర్వహించారు.
సిద్దరామయ్య ఎవరు?
సిద్దరామయ్య, (జననం: 3 ఆగష్టు 1947) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతని ముద్దుపేరు సిద్దూ. ఆపేరుతో కూడా పిలుస్తారు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. అతను భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందినరాజకీయ నాయకుడు.
కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు?
బొమ్మై ముఖ్యమంత్రి కాగా, అతని కుమారుడు బసవరాజ్ బొమ్మై కూడా బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. కర్ణాటకలో 2007 నుండి 2008 వరకు ఆరు సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి భారతీయ జనాతా పార్టీ నుండి బసవరాజ్ బొమ్మై 2021 జూలై 28 నుండి కొనసాగుచున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper :epapervaartha.com
Read Also: