📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Siddaramaiah: క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రికి క్ష‌మాప‌ణ చెప్పిన మెటా సంస్థ‌..ఎందుకంటే?

Author Icon By Sharanya
Updated: July 18, 2025 • 1:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఇటీవల మెటా సంస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కారణం — ప్రముఖ సినీనటి బి. సరోజాదేవి మృతిపై సీఎంఓ (CMO) విడుదల చేసిన కన్నడ సంతాప సందేశాన్ని, మెటా ఫేస్‌బుక్ (Meta Facebook) ఆంగ్లంలో తప్పుడు విధంగా అనువదించడమే. ఆ అనువాదం సరిగ్గా కాకపోవడంతో సీఎం తీవ్రంగా స్పందించారు. ఇటువంటి తప్పిదాలు ప్రజల్లో గందరగోళాన్ని కలిగించే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.

మెటా కంపెనీ స్పందన: “క్షమాపణలు తెలుపుతున్నాం”

ఈ వివాదానికి సంబంధించి తాజాగా మెటా ప్రతినిధులు స్పందించారు. అనువాదంలో ఏఐ టూల్ మిష‌న్ త‌ప్పిదం వ‌ల్ల ఇలా జ‌రిగింద‌ని సంస్థ ఫేస్‌బుక్‌లో పేర్కొంది. క‌చ్చిత‌మైన అనువాదాన్ని అందించేందుకు కృషి చేస్తామ‌ని తెలిపింది. ఏఐ సాంకేతిక‌త‌ను మెరుగుప‌ర‌చుకునే ప్రాసెస్‌లో ఉన్నామ‌ని, ఇందులో భాగంగానే త‌ప్పిదం జ‌రిగింద‌ని మెటా వివ‌రించింది.

అసలు ఎం జరిగింది?

ప్రముఖ నటి బి. సరోజాదేవి మృతి పట్ల సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) తన అధికారిక CMO ఖాతాలో కన్నడ భాషలో సంతాపం తెలిపారు. సీఎం సిద్ధ‌రామ‌య్య బ‌హుభాషా తార, సీనియ‌ర్ న‌టి బి. స‌రోజాదేవి పార్థీవ‌దేహానికి క‌డ‌సారి నివాళుల‌ర్పించార‌ని అందులో పేర్కొంది. దీన్ని మెటా సంస్థ ఆంగ్లంలో త‌ప్పుగా అనువ‌దించింది. దీంతో ప్రజలతోపాటు ముఖ్యమంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని సిద్ధ‌రామ‌య్య ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో తాజాగా మెటా కంపెనీ స్పందిస్తూ సీఎంకు సారీ చెప్పింది .

Read hindi news: hindi.vaartha.com

Read also: Bandi Sanjay: రెండు రాష్ట్రాల జల వివాదాల పై ఎన్డీయే ప్రభుత్వ తొలివిజయం: కేంద్రమంత్రి

Breaking News Facebook Translation Kannada to English Error latest news Meta AI Mistake Meta Apology Sarojadevi Tribute Siddaramaiah Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.