📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Shubhman Gill: భారత వన్డే జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపిక?

Author Icon By Anusha
Updated: July 11, 2025 • 12:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ పేరును వన్డే జట్టు కెప్టెన్‌గా పరిశీలిస్తున్నట్లు జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో (cricket circles) హాట్ టాపిక్‌గా మారాయి. టీమిండియాకు వన్డే ఫార్మాట్‌లో నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు గిల్‌ను బీసీసీఐ సిద్ధం చేస్తోందని, శ్రీలంకతో రానున్న వన్డే సిరీస్‌లో ఆయన కెప్టెన్‌గా బరిలోకి దిగే అవకాశముందని సమాచారం. అలాగే గిల్ కు టీ20 వైస్ కెప్టెన్సీని కూడా అప్పగిస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తో బీసీసీఐ చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.టెస్టు క్రికెట్‌లో రోహిత్ శర్మ ఫామ్ కోల్పోవడంతో అతని టెస్ట్ కెరీర్ ముగియడం అనివార్యమని అంతా భావించారు.

గొప్ప విజయాలను

ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శన తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకున్నాడు. కెప్టెన్‌గా రోహిత్ భారత్‌కు అనేక గొప్ప విజయాలను అందించినప్పటికీ బ్యాటర్‌గా టెస్టుల్లో అంత గొప్పగా రాణించలేకపోయాడు. 2027 ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకొని రోహిత్, కోహ్లీ వన్డేలలో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. వన్డేలలో రోహిత్ శర్మ అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నందున కెప్టెన్‌గా కొనసాగుతాడని అందరూ ఊహించారు.అయితే ఒక ప్రముఖ జర్నలిస్ట్ సోషల్ మీడియా వేదికపై చేసిన పోస్ట్ ప్రకారం, టీమిండియా తదుపరి వన్డే సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపారు. టెస్టుల్లో టీమిండియా పగ్గాలు చేపట్టిన గిల్, రోహిత్ నుంచి వన్డే సారథ్య బాధ్యతలను కూడా తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ పోస్ట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. దీనిపై ప్రస్తుతం నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది.

Shubhman Gill: భారత వన్డే జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపిక?

వచ్చే ఏడాదికి

దీనికి చాలా మంది మద్దతు తెలపగా మరికొందరు ఆశ్చర్యపోయారు.ఈ లోపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్‌కు తిరిగి రావాల్సి ఉంది. కానీ బీసీసీఐ, బీసీబీ పరస్పర నిర్ణయంతో ఈ సిరీస్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. ఈ సీనియర్ ఆటగాళ్లు నవంబర్‌లో టీమిండియా ఆస్ట్రేలియా (Australia) పర్యటనకు వెళ్లినప్పుడు తిరిగి వన్డేలలో ఆడనున్నారు. ప్రపంచ కప్‌కు ముందు భారత్ కొన్ని వన్డేలు మాత్రమే ఆడనుంది. కాబట్టి ఈ స్టార్ ఆటగాళ్లు ఫిట్‌గా, ఫామ్‌లో ఉండటం వారికి పెద్ద సవాలుగా మారనుంది.

శుభ్‌మన్ గిల్ జననం ఎక్కడ జరిగింది?

శుభ్‌మన్ గిల్ జననం 8 సెప్టెంబర్ 1999న పంజాబ్ రాష్ట్రంలోని ఫజిల్కా జిల్లా, చక్ఖేరా గ్రామంలో జరిగింది.

శుభ్‌మన్ గిల్ క్రికెట్‌లో అరంగేట్రం ఎప్పుడు జరిగింది?

వన్డేలో గిల్ తన అరంగేట్రం 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చేశాడు.టెస్ట్ క్రికెట్‌లో 2020 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడాడు.T20 అరంగేట్రం 2023లో శ్రీలంకతో చేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Jagan Mohan Rao: హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావుకు రిమాండ్

BCCI new captain decision Breaking News Gill T20 vice captain India Sri Lanka ODI series 2025 latest news Rohit Sharma Captaincy Shubman Gill ODI captain Team India captain news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.