📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Shashi Tharoor: అందరి చూపు పార్లమెంట్ చర్చల పైనే ..శశిథరూర్ మౌనంపై కొనసాగుతున్న ఉత్కంఠ

Author Icon By Sharanya
Updated: July 28, 2025 • 10:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నేటి నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడి, తరవాత కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor) పై లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చ జరగనుంది. ఈ చర్చలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత, ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) ఈ చర్చలో పాల్గొంటారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. గతంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో ఏర్పాటైన అఖిలపక్ష బృందాలకు శశిథరూర్ నాయకత్వం వహించారు. ఆ సమయంలో అమెరికా సహా పలు విదేశాల్లో భారత ప్రభుత్వ వైఖరిని సమర్థిస్తూ ప్రచారం జరిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు శశిథరూర్ (Shashi Tharoor) ప్రవర్తనపై తీవ్రంగా విమర్శించారు. బీజేపీ లో చేరుతారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

శశిథరూర్  గైర్హాజరీపై వివిధ ఊహాగానాలు

కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చర్చలో పాల్గొనాలనుకునే ఎంపీలు తమ పేర్లను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (CPP) కార్యాలయానికి ముందుగానే సూచించాలి. అయితే, శశిథరూర్ (Shashi Tharoor) ఇప్పటివరకు అలాంటి అభ్యర్థనను పంపలేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే తిరువనంతపురం ఎంపీ అయిన థరూర్ ఈ కీలక చర్చను దాటవేస్తే పార్టీతో ఆయన విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. థరూర్ ప్రభుత్వ వైఖరిని, కాల్పుల విరమణను బహిరంగంగా సమర్థించడం, ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న పార్టీలోని పలు వర్గాల ఆగ్రహానికి దారితీసినట్లు సమాచారం. కాగా త్వరలో జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 5 గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకరు శశిథరూర్ ఉండడం విదితమే.

శశిథరూర్ గైర్హాజరీపై ఎందుకు చర్చ జరుగుతోంది?

శశిథరూర్ పార్లమెంట్‌లో జరుగుతున్న కీలక చర్చలకు హాజరుకాకపోవడంతో రాజకీయ వర్గాల్లో, మీడియా వర్గాల్లో అతని గైర్హాజరీపై అనేక అనుమానాలు, ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన మౌనం వెనుక వ్యూహాత్మక కారణమా లేదా వ్యక్తిగత కారణమా అనే ప్రశ్నలు చర్చనీయాంశమవుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also: Loksabha : లోక్ సభలో నేడు ఆపరేషన్ సిందూర్ పై ప్రత్యేక చర్చ

Breaking News latest news parliament session 2025 Parliamentary Debates Political Speculations Shashi Tharoor Shashi Tharoor Silence Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.