Shashi Tharoor: ‘కేరళమ్’గా మారిన ‘కేరళ’.. శశిథరూర్ చమత్కార వ్యాఖ్య

Read Time:  1 min
Shashi Tharoor: ‘కేరళమ్’గా మారిన ‘కేరళ’.. శశిథరూర్ చమత్కార వ్యాఖ్య
FONT SIZE
GET APP

Shashi Tharoor: కేరళ (Kerala) రాష్ట్రం పేరును అధికారికంగా ‘కేరళం’ గా మారుస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై ఎంపీ శశి థరూర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధి కంటే పేర్లు మార్చడంపైనే ఎక్కువ శ్రద్ధ ఉందని ఆయన విమర్శించారు. కేరళకు ఒక్క ఎయిమ్స్ కానీ, కొత్త విద్యా సంస్థలు కానీ కేటాయించని కేంద్రం.. పేరు మార్పు తీర్మానాన్ని మాత్రం వెంటనే ఆమోదించడంపై ఆయన ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు.

Read Also: Kerala High Court: కేరళ సీఎంఓపై హైకోర్టు సీరియస్

Shashi Tharoor: ‘కేరళమ్’గా మారిన ‘కేరళ’.. శశిథరూర్ చమత్కార వ్యాఖ్య
Shashi Tharoor: ‘Kerala’ has become ‘Keralaam’.. Shashi Tharoor’s interesting comment

ఎన్నికల వేళ పేరు మార్పు..

పేరు మార్పుపై థరూర్ తనదైన శైలిలో చమత్కరించారు. మలయాళంలో ఇప్పటికే ‘కేరళం’ అని పిలుస్తారని, దాన్ని ఇంగ్లీషులోకి కూడా తీసుకురావడంలో అర్థం లేదని ఆయన వాదించారు. పేరు మార్చాక ప్రజలను ఏమని పిలవాలనే దానిపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ప్రజలను ‘కేరళమైట్ అని పిలిస్తే అది ఏదో బ్యాక్టీరియా పేరులా అనిపిస్తోంది. పోనీ కేరళమియన్ అంటే ఏదో ఖనిజం పేరులా ఉంది” అంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

అన్ని భారతీయ భాషల్లోనూ ‘కేరళం’ అనే పేరు ఉండాలని కేరళ సీఎం పినరయి విజయన్ గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళవారం జరిగిన సమావేశంలో కేబినెట్ ఆమోదం తెలిపింది. కేరళలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.