📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Latest Telugu News: Chhattisgarh: పెళ్లికి ముందు భార్య పీరియడ్స్ ను దాచడం క్రూరత్వమే: హైకోర్టు

Author Icon By Vanipushpa
Updated: December 11, 2025 • 5:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తనకు రుతుక్రమం జరగడం లేదనే విషయాన్ని దాచిపెట్టిందని, వివాహం తర్వాత వైవాహిక బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఇటీవల భర్త విడాకులు తీసుకున్నాడు. ఫ్యామిలీ కోర్టు విడాకులను మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును చత్తీస్​గఢ్​ హైకోర్టు(Chhattisgarh High court) లో భార్య సవాలు చేసింది. అయితే ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ, భార్య అప్పీల్​ను కొట్టివేసింది. దీనిని మానసిక క్రూరత్వంగా పేర్కొంటూ హైకోర్టును విడాకులను సమర్థించింది. కబీర్‌ధామ్‌ జిల్లాకు చెందిన ఈ దంపతుల వివాహం 2015 జూన్‌ 5న హిందూ ఆచారాల ప్రకారం జరిగింది. మొదటి రెండు నెలలు సంబంధాలు సాధారణంగానే ఉన్నా, తర్వాత విభేదాలు చెలరేగాయి. దీంతో భర్త ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్‌ వేసి, భార్య గత 10 ఏళ్లుగా రుతుక్రమం రావడం లేదని అనే విషయాన్ని పెళ్లికి ముందు దాచిందని ఆరోపించాడు.

Read Also: Mamata Banerjee : ‘సర్‌’ పేరుతో తల్లులు, సోదరీమణుల హక్కులను లాక్కుంటారా?’ మమతా బెనర్జీ

Chhattisgarh

ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారు

ఒక రోజు భార్య తనకు అకస్మాత్తుగా నెలసరి ఆగిపోయిందని చెప్పడంతో ఆమెను వెంటనే వైద్యుడి వద్దకు తీసుకెళ్లినట్లు భర్త కోర్టులో వివరించాడు. ‘అక్కడ భార్య గత 10 సంవత్సరాలుగా పిరియడ్స్‌ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యుడికి తెలిపింది. భార్య, ఆమె కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని వివాహానికి మందు ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారు. ఈ విషయం ముందే చెబితే పెళ్లి కుదరదని భార్య ఒప్పుకుంది. అంతేకాకుండా ఇంట్లో వృద్ధులైన తల్లిదండ్రులు, చిన్నపిల్లల సంరక్షణ వంటి బాధ్యతలను తనపై వేయొద్దని భార్య అభ్యంతరం చెప్పేది’ అని భర్త చెప్పాడు. ఈ కారణంగానే ఇద్దరూ వేర్వరుగా జీవించడం ప్రారంభించామని చెప్పింది. ఇద్దరి వాదాలను విన్న ఫ్యామిలీ కోర్టు, భర్త ఆరోపణలను అంగీకరించ విడాకులు మంజూరు చేసింది.

భార్యాభర్తల మధ్య వివాదాలు చాలా తీవ్రంగా మారింది

ఈ తీర్పును సవాల్‌ చేస్తూ భార్య ఛత్తీస్​గఢ్​ హైకోర్టును ఆశ్రయించింది. దంపతులు 2016 నుండి విడిగా జీవిస్తున్నట్లు ఇద్దరూ అంగీకరించినట్లు హైకోర్టు తెలిపింది. వైద్య పత్రాలు చూస్తే భార్యకు చికిత్స జరుగుతున్నప్పటికీ, తన ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నట్లు నిరూపించలేకపోయిందని పేర్కొంది. భార్యాభర్తల మధ్య వివాదాలు చాలా తీవ్రంగా మారాయని, మళ్లీ సాధారణ దాంపత్య జీవనం కొనసాగించడం సాధ్యం కాదుని తన నిర్ణయంలో పేర్కొంది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, భార్య అప్పీల్​ను కొట్టివేసింది. అయితే భార్య ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రూ.5 లక్షల శాశ్వత భరణం ఇవ్వాలని చెప్పింది. ఈ మొత్తాన్ని 4 నెలల్లోగా భార్యకు చెల్లించాలని భర్తకు ఆదేశించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Female Foeticide Gender Discrimination Gender Equality Google News in Telugu Indian society Latest In telugu news Sex-Selective Abortion Social issues Telugu News Today Women’s Rights

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.