📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం

జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం: ట్రంప్

Author Icon By Divya Vani M
Updated: January 24, 2025 • 10:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సియాటిల్ ఫెడరల్ కోర్టు షాక్ ఇచ్చింది. ట్రంప్ జారీ చేసిన ఆదేశాలు అమెరికా రాజ్యాంగానికి విరుద్ధమని అభిప్రాయపడుతూ, కోర్టు వాటిని తాత్కాలికంగా నిలిపివేసింది.ఈ నెల 20న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ట్రంప్ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం ప్రపంచాన్ని అశ్చర్యపరిచింది. వాటిలో జన్మతః పౌరసత్వ రద్దు కీలక నిర్ణయంగా మారింది. ఈ ఆదేశాల ప్రకారం, అమెరికాలో పుట్టిన వారికి పౌరసత్వం లభించదని ట్రంప్ ప్రకటించారు.అయితే, ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్రమైన ప్రతిస్పందనలు వచ్చాయి. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలోని 22 రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించాయి. ముఖ్యంగా, డెమొక్రాట్ల నేతృత్వంలో ఉన్న వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయిస్, ఓరెగాన్ రాష్ట్రాలు ట్రంప్ ఆదేశాలను సవాలు చేస్తూ సియాటిల్ ఫెడరల్ కోర్టులో కేసు వేశారు.

జన్మత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం ట్రంప్

వీరి వాదన ప్రకారం, ట్రంప్ నిర్ణయం రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకమని, ప్రజల ప్రాథమిక హక్కులను హరించేదిగా ఉందని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో సియాటిల్ ఫెడరల్ కోర్టు ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది.ఈ నిర్ణయం ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మారింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం జన్మతః పౌరసత్వం ఒక మౌలిక హక్కు అని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ తీర్పు తర్వాత ట్రంప్ నిర్ణయంపై మరింత చర్చ ప్రారంభమైంది.ఇదే సమయంలో, జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేయాలనే ట్రంప్ ప్రతిపాదన, అతని పాలనలో మరిన్ని వివాదాలకు దారితీస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా వ్యాప్తంగా ప్రజలు, రాజకీయ నాయకులు, మరియు సామాజిక కార్యకర్తలు ఈ అంశంపై ట్రంప్‌కు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

birthright citizenship Donald Trump executive orders Seattle Federal Court Ruling US Constitution US Federal Court

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.