हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Breaking News – Police Suicide: హరియాణాలో సంచలనం.. మరో పోలీస్ సూసైడ్

Sudheer
Breaking News – Police Suicide: హరియాణాలో సంచలనం.. మరో పోలీస్ సూసైడ్

హరియాణాలో గత వారం సంచలనంగా మారిన IPS అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు మరోసారి భారీ మలుపు తీసుకుంది. పూరన్‌పై అవినీతి కేసును విచారిస్తున్న ASI సందీప్ లాతర్ అనూహ్యంగా తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రోహ్క్ జిల్లాలోని ఆయన నివాసంలో చోటుచేసుకుంది. ఘటన స్థలంలో పోలీసులు 3 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు, అందులో సందీప్ తన మరణానికి IPS పూరన్ కుమారే బాధ్యుడు అని పేర్కొనడం సంచలనంగా మారింది. ఈ సంఘటనతో రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో కలకలం రేగింది.

సూసైడ్ నోట్లో సందీప్ లాతర్ పూరన్ కుమార్ తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని, అవినీతి విచారణను రాజకీయ ఒత్తిడులతో దారిమళ్లించాలనే ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. ఆయన రోహ్క్ సైబర్ సెల్లో పనిచేస్తూ, పూరన్ కుమార్‌ పై ఉన్న అవినీతి ఆరోపణలను పరిశీలిస్తున్నారు. “నా నిజాయితీని వదిలిపెట్టమని ఒత్తిడి చేశారు, కానీ నేను వంచన చేయలేకపోయాను” అని నోట్లో రాసినట్లు సమాచారం. ఈ సంఘటనతో పూరన్ కేసు మరింత క్లిష్ట స్థితికి చేరుకుంది. పూరన్ కుమార్ ఇటీవలే తనను వేధిస్తున్నారని, 16 మంది IAS, IPS అధికారుల పేర్లు ప్రస్తావిస్తూ ఆత్మహత్య చేసుకోవడం గుర్తు.

ప్రస్తుతం హరియాణా ప్రభుత్వం ఈ రెండు ఆత్మహత్యలపై సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోంది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అంతర్గత విభేదాలు, ఉన్నతాధికారుల ఒత్తిడి, రాజకీయ జోక్యం వంటి అంశాలపై దర్యాప్తు జరపాలని ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది. ప్రజల్లో ఈ ఘటనపై ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు వరుస ఆత్మహత్యలు హరియాణా పోలీస్‌ వ్యవస్థలో లోపలి రాజకీయాలు, ఒత్తిడి సంస్కృతిని బహిర్గతం చేస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870