తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నటుడు, తమిళగ వెట్రీ కజగం (టీవీకే) చీఫ్ విజయ్‌కు రాజకీయంగా మరింత బలం చేకూరింది. అన్నాడీఎంకే బహిష్కృత నేత కేఏ సెంగొట్టయన్ (Sengottaiyan) గురువారం ఆ పార్టీలో చేరారు. చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయంలో పార్టీ కండువా కప్పిన విజయ్ ఆయనకు స్వాగతం పలికారు. 2026 ఎన్నికలకు ముందు అట్టడుగు స్థాయి నుంచి టీవీకే బలోపేతం కోసం సెంగొట్టయన్‌కు(Sengottaiyan) పార్టీలో కీలక పదవి ఇవ్వనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే టీవీకే అధికారంలోకి వస్తే ఆయనకు కీలక మంత్రి పదవి ఇవ్వనున్నట్లు విజయ్ నుంచి హామీ కూడా లభించినట్లు తెలుస్తున్నది.
Read Also : http://Governor of Tamil Nadu : గవర్నర్ పై సీఎం స్టాలిన్ ఆగ్రహం
కాగా, అన్నాడీఎంకే కంచు కోట అయిన పశ్చిమ తమిళనాడులోని గౌండర్ కమ్యూనిటీకి చెందిన ప్రభావవంతమైన నేత సెంగొట్టయన్. తొమ్మిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అద్భుతమైన ప్రచార వ్యూహకర్తగా పేరుగాంచారు. ఎంజీఆర్, జయలలితకు నమ్మకస్థుడిగా ఉన్నారు. నియోజకవర్గ స్థాయి ప్రణాళిక, సంస్థాగత చతురతకు పేరుగాంచిన సెంగొట్టయన్ టీవీకేలో చేరడం తమిళనాడు రాజకీయాల్లో పెద్ద పరిణామని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: