📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Supreme court-కొంతమందినైనా జైలుకు పంపిస్తే కానీ ఈ సమస్య తీరదు

Author Icon By Sushmitha
Updated: September 18, 2025 • 11:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: పంట వ్యర్థాల దహనంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు(Supreme court) తాజాగా విచారణ జరిపి కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందుకు పాల్పడిన కొంతమంది రైతులనైనా జైలుకు పంపిస్తేనే మిగతా వారికి గట్టి సందేశం ఇచ్చినట్లవుతుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రైతులు మనకు అన్నం పెడుతున్నారని, అయితే దాని అర్థం పర్యావరణాన్ని పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలని కాదని ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు.

అధికారులు, రైతులపై సుప్రీం ప్రశ్నలు

పంట వ్యర్థాలను తగలబెట్టకుండా రైతులకు(farmers) సబ్సిడీలు, వివిధ పరికరాలు అందిస్తున్నట్టు అమికస్ క్యూరీ అపరాజిత సింగ్ కోర్టుకు తెలిపారు. అయితే, ఉపగ్రహాలు ఆయా ప్రాంతాల మీదుగా వెళ్లేటప్పుడు కాకుండా మిగిలిన సమయాల్లో వ్యర్థాలను కాల్చుకోవచ్చని అధికారులు చెప్పినట్టు రైతులు పదేపదే చెబుతున్నారని ఆమె విన్నవించారు. దీనిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కొందరినైనా జైలుకు(prison) పంపితేనే సరైన సందేశం వెళ్తుందని అభిప్రాయపడింది. రైతులపై జరిమానా విధించే ఆలోచన ఎందుకు చేయడం లేదని కూడా ప్రశ్నించింది. పర్యావరణాన్ని పరిరక్షించాలనే నిజమైన ఉద్దేశమే ఉంటే ఇలాంటి చర్యలకు దూరంగా ఎందుకు ఉండరని నిలదీసింది.

పొల్యూషన్ కంట్రోల్ బోర్డుల్లో ఖాళీలపై ఆగ్రహం

కొన్ని రాష్ట్రాల్లోని పొల్యూషన్(Pollution) కంట్రోల్ బోర్డుల్లో ఖాళీలు ఉండటంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మూడు నెలల్లోగా అన్ని ఖాళీలను భర్తీ చేయాలని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో శీతాకాలంలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకోవడానికి పంట వ్యర్థాల దహనం ప్రధాన కారణంగా గుర్తించారు. ఈ కాలుష్యాన్ని అరికట్టేందుకు మూడు వారాల్లోగా ప్రణాళికలు సమర్పించాలని కోర్టు సంబంధిత బోర్డులను ఆదేశించింది.

పంట వ్యర్థాల దహనంపై సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించింది? జ: కొందరినైనా జైలుకు పంపితేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది.

ప్ర: ఢిల్లీలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణం ఏమిటి? జ: ప్రతి ఏటా శీతాకాలంలో పంట వ్యర్థాలను తగలబెట్టడమే వాయు కాలుష్యానికి ప్రధాన కారణంగా గుర్తించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ap-weather-heavy-rain-alert-in-several-districts-next-24-hours/andhra-pradesh/549503/

air pollution crop burning Delhi-NCR environmental protection. Farmers Latest News in Telugu Supreme Court

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.