📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

భార్యతో సెల్ఫీ, మావోయిస్టు అగ్రనేత ప్రాణాలు తీసింది!

Author Icon By Vanipushpa
Updated: January 22, 2025 • 3:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది వరకు మావోయిస్టులు మృతి చెందారు. కేంద్ర, రాష్ట్ర పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో మృతి చెందిన వారిలో సీనియర్ మావోయిస్ట్ లీడర్ జయరామ్ రెడ్డి అలియాస్ చలపతి ఉన్నాడు. చలపతి దశాబ్దాలుగా పోలీసుల నుంచి తప్పించుకుంటున్నాడు. కానీ తన భార్య అరుణ అలియాస్ చైతన్య వెంకట్ రవితో అతను దిగిన సెల్ఫీ అతని ప్రాణాల మీదకు తెచ్చింది. చలపతి భార్య అరుణ కూడా మావోయిస్ట్. అరుణ ఆంధ్ర-ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ డిప్యూటీ కమాండర్‌గా పని చేసింది. ఆ సమయంలో తన భర్తతో సెల్ఫీ తీసుకుంది. ఈ సెల్ఫీయే చలపతి రూపురేఖలను గుర్తించడంలో పోలీసులకు సహాయపడింది.అరుణ తన భర్త చలపతితో దిగిన సెల్ఫీని సోదరుడైన ఆజాద్‌కు పంపించింది. 2016లో ఏపీలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ ఆజాద్ చనిపోయాడు. ఆజాద్ స్మార్ట్ ఫోన్ పోలీసుల చేతికి చిక్కింది. అప్పుడే చలపతి ఎలా ఉంటాడనే విషయం తెలిసింది. పోలీసులు అతని తలకు రూ.1 కోటి రివార్డును ప్రకటించారు.

2008 ఫిబ్రవరిలో ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో జరిగిన దాడిలో 13 మంది పోలీసులు మృతి చెందారు. ఈ ఘటన మాస్టర్ మైండ్ చలపతిగా గుర్తించిన పోలీసులు అతని తలపై రూ.1 కోటి రివార్డ్ ప్రకటించారు. అయితే చలపతి ఎలా ఉంటాడో చాలా రోజుల వరకు బయటకు తెలియరాలేదు. 2016 వరకు అతని ఫొటోలు పోలీసులకు లభించలేదు. చలపతి చిత్తూరు వాసి. మావోయిస్ట్ సెంట్రల్ కమిటీలో సీనియర్ సభ్యుడు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో అతను చురుగ్గా ఉండేవాడు. ఆ ప్రాంతంలో ఎన్‌కౌంటర్లు పెరుగుతుండటంతో కొన్ని నెలల క్రితం తన స్థావరాన్ని మార్చుకున్నాడు. అతను ఒడిశా బార్డర్‌కు వచ్చాడు. చలపతి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటాడని పోలీసులు గుర్తించారు.

chhattisgarh -odisha maoist chalapathi selfy photo with wife top leader killed

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.