📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు

Manipur :మణిపూర్‌లో అధునాతన ఆయుధాల సీజ్‌..

Author Icon By Sudha
Updated: June 14, 2025 • 5:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మణిపూర్‌లో అల్లరిమూకలపై భద్రతా బలగాలు (Security forces)ఉక్కుపాదం మోపుతున్నాయి. మణిపూర్‌ పోలీసులు, అసోం రైఫిల్స్‌, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌ జాయింట్‌ ఆపరేషన్‌ (Operation)లో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఐదు జిల్లాల్లో (In five districts)సోదాలు చేసిన పోలీసులు, భద్రతా బలగాలు 328 అధునాతన ఆయుధాలను సీజ్‌ చేశాయి.

Manipur :మణిపూర్‌లో అధునాతన ఆయుధాల సీజ్‌..

151 SLR రైఫిళ్లు, 65 ఇన్సాస్‌ రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 9,300 రౌండ్ల బుల్లెట్లతోపాటు.. భారీగా పేలుడు పదార్ధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మణిపూర్‌లోని ఇంఫాల్ లోయలోని ఐదు జిల్లాల్లో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ, బిష్ణుపూర్, కాక్చింగ్, తౌబాల్ అనే ఐదు లోయ జిల్లాల శివార్లలో జూన్ 13-14 మధ్య రాత్రి నిఘా వర్గాల నేతృత్వంలో దాడులు నిర్వహించినట్లు మణిపూర్ పోలీసులు తెలిపారు.
ఆయుధాల నిల్వలు
“ఉమ్మడి బృందాలు పేలుడు పదార్థాలు, ఇతర ఆయుధాల నిల్వలను స్వాధీనం చేసుకున్నాయి. 151 SLR రైఫిల్, 65 ఇన్సాస్ రైఫిల్స్, ఇతర రకాల 73 రైఫిల్స్, 5 కార్బైన్ గన్, 2 MP-5 గన్, భారీగా బుల్లెట్ నిల్వలను స్వాధీనం చేసుకున్నాయి” అని మణిపూర్ పోలీసు ADGP లారి డోర్జీ లాటూ తెలిపారు. మొత్తం తుపాకులు, రైఫిళ్లు 328 స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు.
మణిపూర్‌లో శాంతిభద్రతలు కాపాడడానికి ప్రజలకు సహకరించాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు. అరాచకశక్తులపై పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు ఏడీజీపీ డార్జీ. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడుతామని వెల్లడించారు. సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి అందరూ సహకరించాలని.. మణిపూర్ పోలీసులు, భద్రతా దళాలు కోరాయి. ఈ విధమైన పరిస్థితుల్లో, సాధారణ ప్రజల జీవనావరణం చాలా ప్రభావితమవుతుంది. అల్లరి, హింసా ఘటనలు, ప్రజల మధ్య అవిశ్వాసం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఉదంతాలు సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో, సుదూర భవిష్యత్తులో ఎలా పరిష్కరించవచ్చో అన్న దానిపై చర్చలు జరుగుతుంటాయి.

Read Also:Tamilnadu: బలవంతంగా అప్పులు వసూళ్లు చేస్తే..5 ఏళ్ల జైలుశిక్ష, రూ

Breaking News in Telugu Google news Google News in Telugu in Manipur Latest News in Telugu Paper Telugu News Seizure of sophisticated weapons Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.