పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు చేదు అనుభవం ఎదురైంది. చైనాలోని తియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంఘం(SCO Meet) శిఖరాగ సమావేశాలకు ప్రపంచ దేశాధినేతలు హాజరయ్యారు. అయితే ఈ మీటింగ్ (SCO Meet)లో రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు. సోమవారం జరిగిన ఎస్‌సీవో సమావేశంలో పుతిన్, మోదీపైనే అందరి దృష్టి నిలిచింది. ఓ దశలో పుతిన్, మోదీ.. ఇద్దరూ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif)ముందు నుంచే వెళ్లారు. పుతిన్, మోదీలు మాట్లాడుకుంటూ ముందుకు నడిచారు. వరుసగా నిలబడ్డ పాక్ ప్రధాని గురించి ఆ ఇద్దరూ ఆలోచించలేదు. పుతిన్, మోదీ ముందు నుంచి వెళ్తుంటే పాక్ ప్రధాని షరీఫ్ వాళ్లను చూస్తూ ఉండిపోయారు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతున్నది. మీటింగ్(SCO Meet) ప్రారంభానికి ముందు మోదీ, పుతిన్ హగ్ చేసుకున్నారు.
ఎస్‌సీవో ప్రోసిడింగ్స్ తర్వాత పుతిన్, మోదీలు ద్వైపాక్షిక భేటీ కోసం కలిసి వెళ్లారు. పుతిన్‌తో సంభాషణ చాలా గాఢంగా ఉన్నట్లు మోదీ తన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఎస్‌సీవో కాన్ఫరెన్స్ వేదిక నుంచి ద్వైపాక్షిక మీటింగ్ జరిగే రిట్జ్ కార్లటన్ హోటల్ వరకు ఇద్దరూ ఒకే కారులో కలిసి వెల్లారు. మోదీ రాక కోసం పుతిన్ పది నిమిషాలు ఎదురుచూసినట్లు తెలుస్తోంది. ఇద్దరూ సుమారు 45 నిమిషాల పాటు కారులోనే వివిధ అంశాలపై చర్చించనుకున్నారు. ఆ తర్వాత ద్వైపాక్షక భేటీలోనూ గంటకుపైగా మాట్లాడుకున్నారు.
ఎస్ సి ఓ సమావేశం అంటే ఏమిటి?
సెప్టెంబర్ 01, 2025. 2025 ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) దేశాధినేతల మండలి 25వ సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
2025 ఎస్సీఓ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది?
SCO టియాంజిన్ సమ్మిట్ 2025 అనేది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) యొక్క 25వ హెడ్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ సమావేశం, ఇది ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1, 2025 వరకు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోని టియాంజిన్‌లో జరుగుతుంది. ఇది చైనా వార్షిక SCO సమ్మిట్‌ను నిర్వహించడం ఐదవసారి మరియు SCO చరిత్రలో అతిపెద్దది.
SCO ఎందుకు స్థాపించబడింది?
SCO యొక్క ప్రధాన లక్ష్యాలు (i) సభ్య దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం ; (ii) రాజకీయ వ్యవహారాలు, ఆర్థిక శాస్త్రం మరియు వాణిజ్యం, శాస్త్రీయ-సాంకేతిక, సాంస్కృతిక మరియు విద్యా రంగాలతో పాటు శక్తి, రవాణా, పర్యాటకం మరియు పర్యావరణ పరిరక్షణలో సహకారాన్ని ప్రోత్సహించడం; (iv) ప్రాంతీయ శాంతిని కాపాడటం,
Read hindi news: hindi.vaartha.com
Read Also: