ఆర్థిక రాజధాని ముంబై మళ్లీ వర్షాల (Mumbai Rains) బెడదతో కుదేలైంది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి.వర్షాలు ఆగని పరిస్థితిలో నగరం స్తంభించిపోయింది. పలు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. రోడ్లపై నిలిచిన నీరు ట్రాఫిక్‌కు అడ్డంగా మారింది.భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వెంటనే స్పందించిన బీఎంసీ పాఠశాలలకు సెలవు (Holiday for BMC schools) ప్రకటించింది.వర్షానికి రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొన్ని చోట్ల చెట్లు కూలడంతో రాకపోకలు ఆగిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే దారుల్లో నీరు చేరింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణికులు ముందుగా బయలుదేరాలని హెచ్చరించింది.ఈ భారీ వర్షాల్లో ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది.

గోడ కూలి వాచ్‌మన్ మృతి
గోద్రెజ్ బాగ్ అపార్ట్‌మెంట్‌లో గోడ కూలింది. సతీష్ టిర్కే అనే వాచ్‌మన్ అక్కడికక్కడే మృతిచెందాడు.వాల్మీకి నగర్‌లో ఓ వ్యక్తి డ్రైనేజీలో పడిపోయాడు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.యులోజియస్ సెల్వరాజ్ అనే మహిళ తన కుమారుడితో రోడ్డు దాటుతోంది. బెస్ట్ బస్సు ఢీకొనడంతో ఇద్దరూ మృతిచెందారు.ముంబైలో కేవలం 81 గంటల్లో 550 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది ఆగస్టు నెల సగటు వర్షంతో సమానం కావడం విశేషం.
విరార్ సరస్సు నిండిపోయి పొంగిపొర్లింది
నగరానికి తాగునీరు అందించే విరార్ సరస్సు నిండి పొంగిపోయింది. ఇది అధికారులు మరింత అప్రమత్తమయ్యేలా చేసింది.ఈ మూడు జిల్లాల్లో వానలు తీవ్రతరంగా కురుస్తున్నాయి. సీఎం అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Read Also :