ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) ధమ్తరీ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కురుద్ బ్లాక్ పరిధిలోని దాహ్దహా గ్రామ ప్రభుత్వ పాఠశాలలోని 35 మంది విద్యార్థులు చేతులు కోసుకున్నారు. బ్లేడ్లు, పిన్నులు, ఫోర్క్ చెంచాల సాయంతో తమ చేతులను కట్ చేసుకున్నారు. సుమారు రెండు నెలలుగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ చెబుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న కలెక్టర్ దర్యాప్తునకు ఆదేశించారు. ప్రిన్సిపల్‌కు నోటీసులు జారీ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు చర్యలకు ఆదేశించారు. విచారణ కోసం ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అభినాశ్ మిశ్రా చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు అధికారులు. పాఠశాలలోని పిల్లలతో పాటు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లల వ్యవహార శైలిపై నిరంతరం పర్యవేక్షణ పెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు. అయితే, పాఠశాల యాజమాన్యం తమకు సమాచారం అందించి స్కూల్‌కు పిలిచారని తల్లిదండ్రులు తెలిపారు.
Read Also: Municipal Elections Results: ‘పార్టీలైన్’ దాటితే ఎలా?
పిల్లల చేతులపై గాయల మరకలు
“ప్రభుత్వ సెంకడరీ పాఠశాలకు చెందిన 6-8 తరగుతుల విద్యార్థులు చేతులు కోసుకున్నారు. దాదాపు గత రెండు నెలలుగా ఇలా చేతులు గాయపరుచుకుంటూనే ఉన్నారు. చాలా మంది పిల్లల చేతులపై గాయల మరకలు ఉన్నాయి.” అని స్కూల్ ప్రిన్సిపల్ పునీత్ రామ్ సాహు అన్నారు. మరోవైపు ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖాధికారి అభయ్ జైశ్వాల్ స్పందించారు. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, స్కూల్ ప్రిన్సిపల్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఎవరైనా విధుల్లో అలసత్వం వహిస్తే వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అయితే, ఇప్పటికీ పిల్లలు ఎందుకు చేతులు కోసుకున్నారు అనే ప్రశ్నకు సమాధానం లేదు. దర్యాప్తు నివేదిక అందిన తర్వాతే అసలు కారణం తెలుస్తుందని కలెక్టర్ వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: