స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఒక కొత్త మోసానికి తెరలేపారు. “మీ ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయకపోతే ఎస్‌బీఐ యోనో యాప్(SBI Yono App) బ్లాక్ అవుతుంది” అనే నకిలీ సందేశాలను విస్తృతంగా పంపిస్తున్నారు. ఈ సందేశాల్లో ఒక లింక్‌ను క్లిక్ చేయమని సూచిస్తూ, దానితో పాటు ఒక ఏపీకే (APK) ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరుతున్నారు. అయితే, ఈ చర్య పూర్తిగా మోసపూరితమని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.
Read Also: Nutrients : ఏ పోషక పదార్థం లోపిస్తే ఏ సమస్యలు వస్తాయో తెలుసుకోండి..!
నకిలీ లింక్‌పై క్లిక్ చేసి ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేయడం
ఈ మోసం ప్రకారం, నకిలీ లింక్‌పై క్లిక్ చేసి ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేయడం వలన, మీ ఫోన్‌లోని బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు తదితర సున్నితమైన సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు చోరీ చేయవచ్చు. ఈ విధంగా, మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావడానికి ప్రమాదం ఉందని, ప్రస్తుతం ఈ నకిలీ సందేశాలు సోషల్ మీడియా, వాట్సాప్ వంటి వేదికలపై అధికంగా వ్యాపిస్తున్నారు.
ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్‌చెక్ విభాగం స్పందించింది. సైబర్ నేరగాళ్ల ఈ చర్యలను పూర్తిగా నకిలీగా ప్రకటించి, ఎస్‌బీఐ గానీ, ఇతర బ్యాంకులు గానీ యాప్ అప్‌డేట్‌ల కోసం ఏపీకే ఫైల్‌లను పంపడం లేదని స్పష్టం చేసింది. అదే సమయంలో, ఎస్‌బీఐ కూడా తమ ఖాతాదారులకు జాగ్రత్తగా ఉండాలని సూచించింది: “ఇలాంటి లింక్స్‌ను క్లిక్ చేయడం లేదా ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయడం మీ డబ్బును దోచుకునే అవకాశం కలిగిస్తుంది” అని హెచ్చరించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: