हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

SBI Yono App: యోనో యాప్ బ్లాక్ అవుతుందా? ఫ్యాక్ట్‌చెక్

Tejaswini Y
SBI Yono App: యోనో యాప్ బ్లాక్ అవుతుందా? ఫ్యాక్ట్‌చెక్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఒక కొత్త మోసానికి తెరలేపారు. “మీ ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయకపోతే ఎస్‌బీఐ యోనో యాప్(SBI Yono App) బ్లాక్ అవుతుంది” అనే నకిలీ సందేశాలను విస్తృతంగా పంపిస్తున్నారు. ఈ సందేశాల్లో ఒక లింక్‌ను క్లిక్ చేయమని సూచిస్తూ, దానితో పాటు ఒక ఏపీకే (APK) ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరుతున్నారు. అయితే, ఈ చర్య పూర్తిగా మోసపూరితమని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

Read Also: Nutrients : ఏ పోష‌క ప‌దార్థం లోపిస్తే ఏ సమస్యలు వస్తాయో తెలుసుకోండి..!

Yono App Will the Yono app be blocked

నకిలీ లింక్‌పై క్లిక్ చేసి ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేయడం

ఈ మోసం ప్రకారం, నకిలీ లింక్‌పై క్లిక్ చేసి ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేయడం వలన, మీ ఫోన్‌లోని బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు తదితర సున్నితమైన సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు చోరీ చేయవచ్చు. ఈ విధంగా, మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావడానికి ప్రమాదం ఉందని, ప్రస్తుతం ఈ నకిలీ సందేశాలు సోషల్ మీడియా, వాట్సాప్ వంటి వేదికలపై అధికంగా వ్యాపిస్తున్నారు.

ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్‌చెక్ విభాగం స్పందించింది. సైబర్ నేరగాళ్ల ఈ చర్యలను పూర్తిగా నకిలీగా ప్రకటించి, ఎస్‌బీఐ గానీ, ఇతర బ్యాంకులు గానీ యాప్ అప్‌డేట్‌ల కోసం ఏపీకే ఫైల్‌లను పంపడం లేదని స్పష్టం చేసింది. అదే సమయంలో, ఎస్‌బీఐ కూడా తమ ఖాతాదారులకు జాగ్రత్తగా ఉండాలని సూచించింది: “ఇలాంటి లింక్స్‌ను క్లిక్ చేయడం లేదా ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయడం మీ డబ్బును దోచుకునే అవకాశం కలిగిస్తుంది” అని హెచ్చరించింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870