స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు అక్టోబర్ 25, 2025 శనివారం డిజిటల్ బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోతాయని ముందస్తుగా తెలియజేసింది. ఈ సమయంలో బ్యాంక్ సిస్టమ్ నిర్వహణ పనులు జరుగుతాయి. షెడ్యూల్ ప్రకారం, ఉదయం 01:10 నుండి 02:10 (IST) వరకు UPI, IMPS, YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్, NEFT(National Electronic Funds Transfer), RTGS వంటి సేవలు 60 నిమిషాల పాటు అందుబాటులో ఉండవు.
Read also: Debt Survey: ఆంధ్రా-తెలంగాణ అప్పుల సంక్షోభం
సేవలు తిరిగి ప్రారంభం అవుతాయి ఉదయం 02:10 గంటలకు. SBI సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఈ విషయాన్ని ప్రకటించి, వినియోగదారులను ముందుగా హెచ్చరించింది. SBI సూచన ప్రకారం, ఈ సమయంలో ATMలు మరియు UPI లైట్ సేవలను ఉపయోగించవచ్చని సూచించారు.
సేవల ప్రత్యామ్నాయాలు మరియు మార్గదర్శకం
మొదట SBI అక్టోబర్ 24, 2025న 12:15 నుండి 01:00 వరకు నిర్వహణ చేయాలని ప్రణాళిక వేసింది, కానీ దానిని ఒక రోజు వాయిదా వేసి అక్టోబర్ 25కి మార్చింది. వినియోగదారులు ఆ సమయంలో అత్యవసర లావాదేవీలకు UPI లైట్ లేదా ATMలను ఉపయోగించవచ్చు. UPI లైట్ అనేది చిన్న మొత్తాల (రూ.1,000 వరకు) లావాదేవీలను పిన్ లేకుండా త్వరగా చేయడానికి అనుమతించే డిజిటల్ వాలెట్ సేవ. ఇది BHIM SBI Pay యాప్ ద్వారా యాక్టివేట్ చేసి ఉపయోగించవచ్చు. అవసరమైతే వినియోగదారులు దీన్ని anytime డీయాక్టివేట్ చేయవచ్చు.
వినియోగదారుల సూచనలు
వినియోగదారులు పెద్ద లావాదేవీలు చేయాల్సిన పరిస్థితిలో, సేవలు తిరిగి ప్రారంభం అయ్యే 02:10 గంటల తర్వాత ఆ లావాదేవీలను పూర్తి చేయవచ్చని SBI సలహా ఇస్తోంది. చిన్న అత్యవసర లావాదేవీల కోసం UPI లైట్, ATMలను ఉపయోగించవచ్చని స్పష్టం చేసింది. ఈ తాత్కాలిక నిలుపుదల గురించి ముందస్తుగా తెలుసుకోవడం కస్టమర్లకు సౌకర్యం కలిగిస్తుంది.
UPI లైట్ అంటే ఏమిటి?
పిన్ లేకుండా రూ.1,000 వరకు చిన్న లావాదేవీలను పూర్తి చేయడానికి డిజిటల్ వాలెట్ సేవ.
UPI లైట్ ఎలా యాక్టివేట్ చేయాలి?
BHIM SBI Pay యాప్‌లో UPI లైట్ విభాగానికి వెళ్లి డబ్బు లోడ్ చేయాలి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: